పాత తరం కమెడియన్లలో ఒక్క వెలుగు వెలిగిన వారు..నీజ జీవితంలో మాత్రం చాలా దుర్భర స్థితిలో మరణించారని వార్తల్లో చదువుతూనే ఉన్నాం.  పాత తరం కమెడియన్లు అనగానే రేలంగి, పద్మనాభం, రాజబాబు, రమణారెడ్డి, చలం వీరందరిలో పద్మనాభం,రాజబాబు, చలం చివరి రోజుల్లో ఎన్నో ఇబ్బందులు పడి చనిపోయారన్న సంగతి తెలిసిందే. తాజాగా పద్మనాభం జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు ప్రముఖ పాత్రికేయులు బీకే ఈశ్వర్.   ఎన్టీఆర్, ఎస్వీ రంగారావు నటించిన ‘పాతాళ భైరవి’ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన పద్మనాభం తర్వాత స్టార్ కమెడియన్, నిర్మాత, దర్శకుడిగా ఎదిగారు. 

ఈ క్రమంలో ఆయన ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు.  అప్పట్లో పద్మనాభం తీసిన కొన్ని సినిమాలు మంచి హిట్ అందుకున్నా..ఒకటీ రెండు సినిమాలు దారుణమైన ఫలితాలు రావడంతో ఆర్థికంగా చితికిపోయారు. పద్మనాభం కి  మొదటి నుంచి నాటకాల పిచ్చి ఎక్కువ. నటనపట్ల తనకి గల ఆసక్తి కారణంగానే అయన సినిమాల వైపుకు వచ్చారు. ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో ఆయన ఊరూరా తిరుగుతూ ఆయన నాటకాలు వేయడం మొదలుపెట్టారు.

తన రెండవ భార్య ప్రమీలా రాణి ఒక బుట్టలో ఆహార పదార్థాలు సర్దేసి ఇస్తే .. నాటకం పూర్తయిన తరువాత తినేసి ఇల్లు చేరుకునేవారు. నటుడిగా, దర్శకుడిగా పెట్టుబడి పెట్టి సినిమాలు తీసిన నిర్మతగా ఆయన్ని చూసిన ప్రమీలా తన భర్త పరిస్థితి చూసి తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి మరణించిందట. దాంతో పద్మనాభం గారు కూడా మానసికంగా చాలా దెబ్బతిన్నారు  అని చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: