ప్రముఖ సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ తర్వాత మళ్ళీ అంతగా వివాదాలతో ఈ మధ్య కాలంలో బాగా సంచనలనం సృష్టిస్తున్న  వివాదాస్పద నటి శ్రీరెడ్డి. సినిమా ఇండస్ట్రీలో అందరిని టార్గెట్ చేస్తూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతు వార్త ల్లో నిలుస్తుంది. అందులో భాగంగానే శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో విమర్శలు తలెత్తడంతో పాటు కంప్లీట్ గా సినిమా ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో చెన్నై కి మకాం మార్చేసింది శ్రీరెడ్డి..అక్కడ సరదాగా బీచ్‌లో ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవుతోంది. అయితే సరదాగా ఎంజాయ్ చేస్తూ కుదురుగా ఉంటే శ్రీరెడ్డి ఎందుకవుతుంది. అందుకే ఎప్పుడు తన వెంట ఎదో ఒకటి ఉండాలి.

అందుకే తను ఎక్కడికి వెళ్లినా వివాదం తన వెంటే ఉండాలి అనుకుంటుందో ఏమో కాని.. తను బీచ్‌లో సరదాగా ఎంజాయ్ చేస్తుండగా ఒక రొమాంటిక్ సీన్ చూసింది. అంటే సినిమాలో సీన్ కాదనుకోండి. శ్రీరెడ్డి బీచ్ పక్కన కార్‌లో ఉండగా.. ఆమె కార్‌కి ఎదురుగా రోడ్డుపై ఇద్దరు లవర్స్ పబ్లిక్‌గా రొమాన్స్ చేస్తున్నారు. రొమాన్స్ అంటే మరీ సినిమాలలో మాదిరిగా మితి మీరిన రొమాన్స్ కూడా కాదు. కాకపోయినా చూడ్డానికి మైనర్‌లుగా ఉన్నారు గనక వాళ్లిద్దరి రొమాన్స్‌ని వీడియో తీసి తన ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసింది శ్రీరెడ్డి.
‘ఈ ఇద్దరూ రోడ్ మీద రొమాన్స్ చేస్తున్నారు. వాళ్ల వయసు 13-14 మాత్రమే ఉంటుంది’ అంటూ తనకు బాగా అలవాటైన భాషను వాడుతూ ఆ వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుండగా.. నెటిజన్లు మాత్రం ఓ రేంజ్‌లో శ్రీరెడ్డిపై ఫైర్ అవుతున్నారు. 

వాళ్లు మైనర్స్ అని నువ్వే అంటున్నావ్.. అలాంటి వాళ్ల వీడియోను వాళ్లకు తెలియకుండా తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయడానికి మరి నీకైనా బుద్ధి ఉండాలి కదా. నువ్వు  రోడ్డు మీద బట్టలిప్పుకుంటే లేదుకాని.. లవర్స్ రొమాన్స్ చేసుకుంటే నీకు తప్పనిపించిందా..! ముందు అనాల్సింది వాళ్లను కాదు నిన్ను.. నీలాంటి వాళ్ళను చూసి వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు.. సమాజానికి ఉపయోగపడే పనులు  ఏమన్నా ఉంటే చెయ్యండి’ అంటూ శ్రీరెడ్డిపై మండిపడుతున్నారు నెటిజన్లు. అంతేకాదు మనం సరిగ్గా ఉన్నప్పుడే వేరే వాళ్ళని వేలెత్తి చూపించాలి. అంతేకాని శ్రీరంగ నీతులు చెప్పడం కాదు అంటున్నారు. అయితే శ్రీరెడ్డి పాయింట్ ఆఫ్ యూలో చూస్తే వాళ్ళు చాలా చిన్నవాళ్ళు కదా..ఇలాంటివి తప్పు కదా..అని కొంతమంది అనే అవకాశం కూడా లేకపోలేదు.  



మరింత సమాచారం తెలుసుకోండి: