స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా అల వైకుంఠపురంలో. ఇంతకముందు బన్ని తో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్న మాటల మాంత్రీకుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కి ట్రై చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచే సినిమా మీద భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక అల సినిమాని కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలోని తొలి పాటకు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఇటీవల విడుదలైన 'సామజవరగమన' పాట యూట్యూబ్‌లో రికార్డ్‌లు సృష్టిస్తోంది. 

తమన్‌ సంగీతమందించిన ఈ సినిమా పాటకు లెజెండరీ లిరిసిస్ట్‌ సిరివెన్నెల సీతారామశాస్త్రీ సాహిత్యమందించడంతో ఈ పాట అందరిలోకి దూసుకుపోయింది. లేటెస్ట్ సెన్సేషన్‌ సింగర్ సిద్‌ శ్రీరామ్‌ ఆలపించిన ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డ్‌ సృష్టించింది. గతంలో ఏ తెలుగు పాటకు రాని విధంగా భారీగా లైక్స్‌, వ్యూస్‌ సాధించటంపై చిత్రయూనిట్‌ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

'సామజవరగమన' పాట విడుదలైన మొదటి 35 నిమిషాల్లో 50 వేల లైక్స్, 88 నిమిషాలకు 1 లక్ష లైక్స్, మూడు గంటల 7 నిమిషాలకు లక్ష 50 వేల లైక్స్, 6 గంటల 12 నిమిషాలకు 2 లక్షల లైక్స్, 10 గంటల 22 నిమిషాలకు 2 లక్షల 50 వేల లైక్స్, 22 గంటల 5 నిమిషాలకు 3 లక్షల లైక్స్ రావడం విశేషం. అలాగే ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్ వ్యూస్, 7 లక్షల లైక్స్ రావడం కూడా గొప్ప విశేషం. ఓ తెలుగు పాటు ఇన్ని వ్యూస్‌...లైక్స్‌ రావటం ఇదే ప్రథమం.
గీతాఆర్ట్స్‌, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. సీనియర్ నటి టబు, మాలీవుడ్‌ యాక్టర్‌ జయరామ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 2020 సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబుకి పోటీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక మొదటి సారి ఈ సినిమా ఆదివారం థియోటర్స్ లోకి రానుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: