మన దేశం గర్వించదగ్గ దర్శకుల్లో ముందు చెప్పుకునే పేరు డైరెక్టర్‌ శంకర్‌. సందేశాత్మక సినిమాలను కూడా భారీ కమర్షియల్‌ హిట్స్‌గా మార్చిన ఘనత శంకర్‌ కే సొంతం. తన సినీ కెరీర్‌ మొత్తంలో చూసుకుంటే చేసినవి తక్కువ సినిమాలే అయినా జాతీయ స్థాయిలో గొప్ప దర్శకుల లిస్ట్‌లో చేరిపోయారు. అందుకు కారణం జెంటిల్ మాన్ సినిమా నుండు రోబో 2.ఓ వరకు ఆయన మేధా శక్తిని ఎవరు అంచనా వేయలేంతగా రూపొందించి సంచనం అయ్యారు. 

అయితే వరుసగా శంకర్‌ తెరకెక్కించిన మూడు సినిమాలు ప్రేక్షకులను బాగా నిరాశపరిచాయి. 3 ఇడియట్స్‌ రీమేక్‌గా తెరకెక్కిన 'నన్బన్‌' కాస్త పరవాలేదనిపించినా తరువాత వచ్చిన 'ఐ', '2.ఓ' సినిమాలు నిర్మాతలకు తీవ్ర నష్టాలను మిగిల్చాయి. దీంతో శంకర్‌ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ఇండియన్‌ 2 సినిమాపై ఆ ప్రభావం గట్టిగా పడింది. ఇదే కాంబినేషన్‌లో ఘన విజయం సాదించిన ఇండియన్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతోంది. శంకర్-కమల్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ప్రారంభమైనప్పటి నుంచే అంచనాలు భారీగా నెలకొన్నాయి. 

అయితే ముందుగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిచాలని అనుకున్నప్పటికి ఆ తరువాత నిర్మాతలు బడ్జెట్ విషయంలో శంకర్ కి లిమిటేషన్స్ పెట్టారు. శంకర్‌ అడిగిన బడ్జెట్‌ ఇవ్వడానికి నిర్మాతలు అసలు ఒప్పుకోకపోవడంతో చాలా కాంప్రమైజ్ అయి బడ్జెట్‌ పరిమితుల్లోనే సినిమా పూర్తి చేసేందుకు అంగీకరించారు శంకర్‌. ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో మూడో షెడ్యూల్‌ షూటింగ్ కోసం భోపాల్ వెళ్లనున్నారు చిత్ర యూనిట్. ఈ షెడ్యూల్‌లోనే ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను షూట్ చేయనున్నారు.

ఒక ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ ఫైట్‌ సీన్‌ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారట. హీరో కమల్‌ హాసన్‌తో పాటు దాదాపు 2000 మంది జూనియర్‌ ఆర్టిస్ట్‌లపై ఈ యాక్షన్‌ సీన్స్‌ను చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. అయితే ఈ ఒక్క ఫైట్ కోసమే 40 కోట్లు అవసరమా అన్న టాక్స్ మొదలయ్యాయి. అంతేకాదు శంకర్ ఇదివరకు చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నాడన్న కామెంట్స్ కూడా పడుతున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: