తెలుగు ప్రజలు అత్యంత ఆదరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్. బుల్లితెర మీద ఈ షోకి ఉన్న పాపులారిటీ చిన్నదేం కాదు.టీఆర్ పీ రేటింగ్స్ లో టాప్ రేటింగ్స్ దక్కించుకుంటున్న గేమ్ షో బిగ్ బాస్. సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు కంప్లీట్ చేసుకుని మూడవ సీజన్లోకి అడుగు పెట్టింది. అయితే ఈ మూడవ సీజన్ కూడా చివరి దశకి వచ్చేసింది. ఫైనల్ కి ఇంకా రెండు వారాలే మిగిలి ఉంది. మొదటి రెండు బిగ్‌బాస్ షోలకన్న సీజన్ 3 కాస్త రసవత్తరంగా సాగుతోంది.


ఈ దశలో ఫైనల్ విన్నర్ ఎవరవుతారనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే బుల్లితెర మీద దూసుకుపోతున్న ఈ షో గురించి బిగ్ బాస్ మాజీ విన్నర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ మొదటి సీజన్ విన్నర్ గా గెలిచిన నటుడు శివబాలాజీ తనదైన శైలిలో స్పందించాడు. ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ,బిగ్ బాస్ షోని తాను చూడటం లేదని అందరికీ షాక్ ఇచ్చాడు.


ఈ సీజన్ లో కుట్రలు, కుతంత్రాలు తప్ప మరోటి కనిపించట్లేదని, ఆ కుట్రల వల్ల ఎంటర్ టైన్ మెంట్ మిస్సవుతుందని అన్నాడు. స్టార్టింగ్ లో కొన్ని ఎపిసోడ్ లూ చూశాడట. వాటిల్లో ఫన్ లేకపోవడంతో ఇక చూడటం మానేశానని అన్నాడు. మరి ఫైనల్ కి చేరువ అవుతున్న తరుణంలో ఎందుకు చూడట్లేదని ప్రశ్నిస్తే, ప్రస్తుతం వేరే పనుల్లో బిజీగా ఉన్నానని అందుకే చూడడానికి వీలుపడటం లేదని చెప్పాడు.


అయితే శివబాలాజీ బిగ్ బాస్ పై చేసిన  వ్యాఖ్యలని ఎవ్వరూ సమర్థించినట్టు కనబడట్లేదు. శివబాలాజీ చెప్పినట్టు మొదట్లో సీరియల్ గా సాగిందనీ, కానీ రాను రాను ఈ ప్రోగ్రామ్ చాలా బాగా ఎంటర్ టైన్ చేస్తుందని చెప్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం బిగ్ బాస్ షో అత్యధిక రేటింగ్స్ తో దుసుకుపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: