మెగాస్టార్ చిరంజీవి అన్న పేరు చాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురవడానికి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా 'సైరా' భారీ అంచనాలతో అక్టోబర్ 2న విడుదలైంది. ఈ సినిమా మూడో వారంలో కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. ఓవర్సీస్‌లో అయితే మొదటి వారంలోనే ఊహించిన కలెక్షన్లు అందుకోలేకపోయాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మెగాస్టార్ స్టామినా చూపించాయి. తొలిరోజు రూ. 50 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు చిరు. రెండు వారాలు తిరిగే సరికి రూ.100 కోట్ల షేర్ సాధించిన నాన్-బాహుబలి సినిమాగా 'సైరా' నిలిచించింది. 

అయితే అనూహ్యంగా మూడోవారంలో పరిస్థితి మారింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా స్పీడ్ తగ్గిపోయింది. మొత్తంగా 15 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.103.74 కోట్ల షేర్ రాబట్టింది 'సైరా'. ఇక ప్రపంచ వ్యాప్తంగా అయితే మొత్తం షేర్ రూ. 138.23 కోట్లు ఉండగా.. గ్రాస్ సుమారు రూ. 227 కోట్లు. అయితే సైరా బడ్జెట్ మొత్తం రూ. 270 కోట్లు పైనే కాబట్టి ఇంకా సేఫ్ జోన్‌కి రాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నారు. మొత్తంగా లాభాల సంగతి పక్కనపెడితే థియోట్రికల్ బిజినెస్ మినహా ఖర్చు చేసింది అంతా రావాలంటే దాదాపు ఇంకా రూ. 40 కోట్లు బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అవుతుందని లాభాలు ఆశించిన కొన్ని ఏరియాలలోని బయ్యర్లకు పెట్టిన ఖర్చే ఇంకా రాకపోవడంతో లాభాలపై ఆశలు వదిలేసుకున్నారట. 

అయితే ఈ శుక్రవారం విడుదలైన రాజుగారి గది 3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్‌ సినిమాలు ప్రేక్షకుల్ని నిరాశపరచడంతో పాటు థియేటర్స్‌లో సినిమాలు ఏమీ లేకపోవడం 'సైరా' ఒక్కటే ఆప్షన్‌గా మారింది. ఇక శని, ఆదివారాలు కలిసి రావడంతో పాటు దీపావళి ఫెస్టివల్‌ సైరా కి కలిసి వస్తుందేమో చూడాలి. మొత్తానికి సైరా చాలామందిని నిరాశపరచింది. ఇక మెగాస్టార్ కొరటాల శివ తో త్వరలో సెట్స్ మీదకు వెళ్ళబోతున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా త్రిష నటించబోతుందని సమాచారం. అయితే ఇంకా ఈ విషయంలో చిత్ర యూనిట్ నుండి ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. 



మరింత సమాచారం తెలుసుకోండి: