మెగాస్టార్ చిరంజీవి మరియు సురేందర్ రెడ్డిల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి ఇటీవల అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓవర్ అల్ గా యావరేజ్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన తొలిసారి నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ ఖర్చుతో నిర్మించడం జరిగింది. షూటింగ్ ప్రారంభం నాటి నుండి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ, సినిమాలోని కథ మరియు కథనాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. 

ఇక ప్రస్తుతం పర్వాలేదనిపించే కలెక్షన్స్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా చాలావరకు నష్టాలు వచ్చే సూచనలు కనపడుతున్నట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొత్తంగా ఒకటి, రెండు చోట్ల తప్పించి మిగతా అన్ని చోట్ల కూడా ఈ సినిమా నష్టాలను మిగులుస్తోందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా నుండి నేర్చుకున్న గుణపాఠంతో తదుపరి తన తండ్రితో నిర్మించబోయే 152వ సినిమా బడ్జెట్ విషయమై చరణ్ కొంత జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. అలానే దర్శకుడు శివ కూడా సినిమా కథ విషయమై ఇటీవల చాలావరకు మార్పులు చేర్పులు చేసారని, 

అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కమర్షియల్ హంగులకు ఏమాత్రం లోటు రాకుండా ఈ సినిమాను తీయనున్నారట కొరటాల. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక పూజా కార్యక్రమాలు ఇటీవల జరుగగా, మరికొద్దిరోజుల్లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఒక స్టార్ హీరోయిన్ మెగాస్టార్ సరసన నటించనున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సైరాకు మ్యూజిక్ అందించిన అమిత్ త్రివేదిని తీసుకునే అవకాశం కనపడుతోందని ఫిలిం నగర్ వర్గాల టాక్....!!


మరింత సమాచారం తెలుసుకోండి: