బాహుబలి స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ రెండేళ్లు గ్యాప్ తీసుకున్న తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమానే సాహో.. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నెల క్రితం వచ్చింది. అయితే, ఆ సినిమా యాక్షన్ కోణంలో తెరకెక్కడంతో ప్రభాస్ కొత్త ప్రయోగం చేసాడు అని అందరు అన్నారు. భారీ బడ్జెట్ తొ తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ కు మాత్రమే నచ్చింది. మిగిలిన వాళ్ళకి మాత్రం నచ్చలేదన్న విషయం తెలిసిందే.. 


సినిమా అతిపెద్ద డిజాస్టర్ గా మారిన తర్వాత బాలీవుడ్ లో ఓ సినిమా చేస్తున్నాడు. రావణ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్నారు.. ఆ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే హౌస్ ఫుల్ 4 సినిమాలో నటించిన పూజ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ గురించి రాగా.. ప్రభాస్ తో చేస్తున్న విషయాన్నీ వెల్లడించింది. 


జిల్ ఫెమ్ రాధాకృష్ణ  దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఒక రొమాంటిక్ కథనం తో రాబోతుందని ఈ అమ్మడు వెల్లడించింది. ఈ సినిమాకు సంబందించిన షూటింగ్ ఇటీవలే యూరప్ లో తెరకెక్కుతుంది. ఆమె మాట్లాడుతూ.. ప్రభాస్ చూసేంత సీరియస్ ఉండరు. చాలా సరదా ఉంటారు అంటూ పూజ ప్రభాస్ పై పొగడ్తలతో ముంచేసింది. ప్రభాస్ ఫుడ్ బాగా చేస్తారు. మా సినిమాకు మంచి చెఫ్ అంటే ప్రభాషే.. 


ఇకపోతే.. ప్రస్తుతం పూజ హెగ్డే అల్లు అర్జున్ నటిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తుంది. అంతేకాకుండా అక్కినేని అఖిల్ నటిస్తున్న కొత్త సినిమాలో అఖిల్ కి జోడిగా పూజాహెగ్డే నటిస్తుంది. ఆ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమానే ప్రభాస్ రాబోతున్న సినిమా లో కూడా ప్రభాస్ తో రొమాన్స్ చేయడానికి సిద్దమయింది.. ఒక్క సినిమా హిట్ అయితే పూజ దశ తిరిగింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: