నా పేరు సూర్య తో దారుణంగా ఫ్లాప్ చూసినా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఆ తర్వాత చేయబోయే సినిమా కోసం చాలా టైం తీసుకుని చివరాఖరికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అలా వైకుంఠపురం లో’ సినిమా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగింది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ అందుకోవటానికి తీవ్రంగా కష్టపడుతున్నారు. వెరైటీ సబ్జెక్టుతో ఈ సినిమా ఉంటుందని ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో అక్కినేని సుశాంత్ మరియు అదే విధంగా సీనియర్ హీరోయిన్ టబు కూడా నటించడంతో సినిమాపై చాలా మందికి ఆసక్తి పెరిగింది.


ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చాలా స్లోగా సినిమాలో సాంగ్ తో మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సాంగ్ అంత ఇంత సెన్సేషన్ క్రియేట్ చెయ్యట్లేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ పాటను సిద్ శ్రీరామ్ పాడగా…ఇటీవల వచ్చిన పాటలలో ఈ పాట మ్యూజిక్ లవర్స్ కి తెగ నచ్చేసింది.


అందుకే ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా పాటకు రానన్ని వ్యూస్ ఈ పాటకు వచ్చేసాయి. యూ ట్యూబ్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఈ పాట విడుదలైన 24 గంటల్లో 6 మిలియన్ వ్యూస్ , 313కే లైక్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఈ పాటకు 40 మిలియన్స్ వ్యూస్, 7 లక్షల లైక్స్ వచ్చాయి. తెలుగులో ఒక సాంగ్ కు ఇన్ని లైక్స్ , వ్యూస్ రావడం ఇదే ప్రధమం. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగులో సామజ వర గమన కొత్త రికార్డు యూట్యూబ్ లో సృష్టించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ఈ సినిమా విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: