‘సైరా’ సక్సస్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో టాప్ హీరోల స్టార్ డమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ‘స్టార్ డమ్’ అనేది షుగర్ కోటెడ్ పిల్ అని చెపుతూ ఆతీపి జీవితంలో శాస్వితంగా ఉండదు అని కామెంట్ చేసాడు. 

అంతేకాదు ఆకాశంలోని మబ్బులు ఎంత శాశ్వితమో స్టార్ డమ్ కూడ అంతే శాస్వితం అని చెపుతూ ఒక హీరో తాను నటించిన పాత్రల వల్ల చరిత్రలో మిగిలిపోతాడు కానీ స్టార్ డమ్ వల్ల కాదు అంటూ తనకు స్టార్ డమ్ పై నమ్మకం లేదు అని అంటున్నాడు. బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా కోసం చనిపోవడానికి కూడ సిద్ధపడ్డ అలనాటి తరం అమ్మాయిలను తాను అప్పట్లో చూశానని అలాంటి రాజేష్ ఖన్నా ఎటువంటి స్టార్ డమ్ లేకుండా చనిపోయిన సందర్బం బట్టి ఈస్టార్ డమ్ ఎంత అశాశ్వితమో తనకు తెలుసు అంటూ కామెంట్ చేసాడు. 

ఇదే సందర్భంలో తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను మెగా స్టార్ హోదా లో ఉన్నా తాను తన ఇంటిలో మాత్రం అతి సామాన్యుడుగానే ప్రవర్తిస్తానన్న విషయాన్ని బయటపెట్టాడు. అంతేకాదు తన సమిష్టి కుటుంబంలో ఉన్న అందరితోను తనకు సన్నిహిత అనుబంధాలు ఉన్నాయని ఇదే విషయాలు తన పిల్లలకు కూడ తాను నేర్పించాను అని చెపుతూ మనిషి ఎదుగుదలలో కుటుంబం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంటుందో తనకు తెలుసు అంటూ కామెంట్ చేసాడు. 

వాస్తవానికి తాను మెగా స్టార్ మెగా స్టార్ గా ఎదగడానికి తన సమర్థత కారణం అని చాలామంది భావిస్తారనీ అయితే తన వెనుక ఒక సూపర్ ఉమెన్ ఉంది అంటూ తన భార్య సురేఖ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఆమె లేకపోతే తన విజయాలు లేవు అంటూ తాను కెరియర్ మీద దృష్టి పెడితే ఇంటి విషయాలు తన పిల్లలతో పాటు తన సమిష్టి కుటుంబ సభ్యుల మంచి చెడులను ఎంతో ప్రేమతో చూసిన సురేఖ తమ ‘మెగా ఫ్యామిలీకి ఒక పిల్లర్’ అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించాడు. కోట్లాది మంది అభిమానులను పొందినప్పటికీ ఇప్పటికీ చిరంజీవికి స్టార్ డమ్ పై నమ్మకం లేకపోవడం బట్టి ఈ రంగంలో ఎంత అనిశ్చిత ఉందో చిరంజీవి మాటలను బట్టి అర్ధం అవుతుంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: