టాలీవుడ్ ని ఏలిన మహానటుడు నందమూరి తారక రామారావు.  ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు కళామతల్లికి రెండు కళ్లు అంటారు.  వీరిద్దరు చలన చిత్ర రంగంలో మరుపురాని మరువలేని సినిమాల్లో నటించి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు.  ప్రస్తుతం సినీ పరిశ్రమలో వీరి వారసులు హీరోలుగా రాణిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వెండి తెరకు పరిచయం అయినా..హరికృష్ణ రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.  గత ఏడాది రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు. 

ఆయన తనయులు జూ.ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు హీరోలుగా రాణిస్తున్నారు.  కళ్యాన్ రామ్ హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. గత కొంత కాలంగా కళ్యాన్ రామ్ నటిస్తున్న సినిమాలు వరుస ఫెయిల్యూర్స్ అవుతున్నాయి. ఆ మద్య డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన 118 కాస్త పరవాలేదు అనిపించుకుంది. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎంత మంచి వాడవురా' మూవీని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారట. సంక్రాంతి అంటేనే సినిమా పండుగ అంటారు..ఈ నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఇదే సమయానికి తమ సినిమాలు రిలీజ్ కోసం సిద్దం చేసుకుంటారు.

ఈ సంక్రాంతికి మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' మరియు అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' మూవీస్ రాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. అయితే వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్న ‘వెంకి మామ’ తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. లాంటి సమయంలో ఎంత మంచి వాడవురా కూడా సంక్రాంతికి వస్తే పోటీ ఎలా ఉంటుందా అనే చర్చ మొదలైంది.  కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఒకవేళ మహేష్, బన్ని సినిమాలు గనక హిట్ టాక్ వస్తే..మనోడికి మళ్లీ కష్టాలు తప్పవంటున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: