రాజమౌళి మస్తిష్కం నుంచి సృష్టించబడిన రాజ్యం.. మాహిష్మతి సామ్రాజ్యం.  ఈ సామ్రాజ్యం కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోరు జరుగుతుంది. తమ్ముడు అన్నను వెన్నుపోటు పొడవడం.. సామ్రాజ్యంతో పాటు అన్న భార్యను కూడా తన వశం చేసుకోవాలని అనుకోవడం.. అన్న కొడుకు తన తండ్రిని చంపిన వాళ్ళపై పగ తీర్చుకోవడం.. ఇది బాహుబలి రెండు సినిమాలకు సంబంధించిన క్లుప్తమైన కథ.  


కథ పరంగా తీసుకుంటే సింపుల్ గా ఉంటుంది.  కానీ, దీని చుట్టూ అల్లుకున్న కథనాలు.. వాటిని అల్లుకున్న తీరు చూస్తే మాత్రం కళ్ళు చెదిరిపోవడం ఖాయం.  రాజమౌళి ఈ సినిమాకు తీసిన విధానం ప్రతి ఒక్కరిని మెప్పించింది.  ఒక ప్రాంతీయ సినిమాను ప్రపంచం మొత్తం అభిమానించేలా తీర్చిదిద్దాడు దర్శకుడు రాజమౌళి.  బాహుబలి ది బిగినింగ్ తరువాత వచ్చిన బాహుబలి 2 సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. 


ఈ రెండు సినిమాలు కలిసి దాదాపు ప్రపంచవ్యాప్తంగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసింది.  ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం అంటే మాములు విషయం కాదు.  ప్రభాస్ కు జాతీయ స్థాయిలో హీరోగా నిలబెట్టింది ఈ సినిమా.  అనేక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమైంది బాహుబలి సినిమా.  ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.  బాహుబలి మొదటి పార్ట్ ది బిగినింగ్ సినిమాను లండన్ లోని రాయల్ అల్బర్డ్ హాల్ లో ప్రదర్శించారు.  


రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శించిన మొదటి నాన్ ఇంగ్లీష్ సినిమాగా బాహుబలి ది బిగినింగ్ పేరు తెచ్చుకుంది.  రాయల్ ఆల్బర్ట్ హాల్ లో గత 148 సంవత్సరాలుగా ఇంగ్లీష్ సినిమాలకు మాత్రమే ప్రదర్శిస్తున్నారు.  ఇప్పటి వరకు నాన్ ఇంగ్లీష్ సినిమా అక్కడ ప్రదర్శించబడలేదు.  మొదటిసారి ఆ గౌరవం బాహుబలి సినిమాకు దక్కింది.  రాజమౌళికి కాదు.. ఇది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి దక్కిన అరుదైన గౌరవంగా చెప్పొచ్చు  


మరింత సమాచారం తెలుసుకోండి: