మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిన్న ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులను కలిసారు. ఈ సమావేశానికి షారుక్ ఖాన్ అమీర్ ఖాన్ కంగన రనౌత్ సోనమ్ కపూర్ లతో పాటు ఎందరో సెలెబ్రెటీలు హాజరు అయ్యారు. 

ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన ఈ సమావేసానికి బాలీవుడ్ తారలతో పాటు టెలివిజన్ సెలెబ్రెటీలు సినిమా ప్రముఖులు అనేకమంది హాజర్ అయినా దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన వారెవరు ఈ కార్యక్రమంలో కనిపించకపోవడం పై చిరంజీవి కోడలు ఉపాసన తన నిరసనను తెలియచేసింది.  ఇప్పుడు ఉపాసన చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.

ఉపాసన మాటల ప్రకారం ‘ప్రియమైన నరేంద్రమోదీ గారు. మిమ్మల్ని దక్షిణాది ప్రజలు ఎంతగానో ఆరాధిస్తారు. మీలాంటి ప్రధాని ఉండటం గర్వంగా భావిస్తాం. ఆ గౌరవం అలానే కొనసాగుతుంటుంది. కానీ మీరు నిర్వహించిన సమావేశానికి కొంతమంది హిందీ తారలనే పిలిచి.. దక్షిణాది సినీ ప్రముఖులను ఆహ్వానించకుండా నిర్లక్ష్యం చేశారనే ఫీలింగ్ కలిగింది’ అంటూ ఉపాసన ట్విట్ చేసింది. 

దీనితో ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించ లేదని ఉపాసన బాథ పడిందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిన్న జరిగిన సమావేశంలో ప్రధాని మోడీ ఉత్తేజకరమైన ప్రసంగం చేస్తూ మహాత్ముడి విలువలను శాంతి సందేశాన్ని వినోద మాధ్యమం ద్వారా మరింత ప్రచారం చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఎప్పటి నుంచో దక్షిణాది ఉత్తరాది ప్రాంతాల మధ్య వివక్ష కొనసాగుతుందనే విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రధాని సమావేశానికి దక్షిణాది తారలు ఎవరిని పిలవక పోవడం ముఖ్యంగా మోడీ కి అతిసన్నిహితుడైన రజినీకాంత్ లాంటి టాప్ సెలెబ్రెటీలు ఈ సమావేశంలో కనిపించపోయినా ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఈ సమావేశానికి హాజర్ కావడంతో దిల్ రాజ్ అడుగులు భారతీయ జనతా పార్టీ వైపు పడుతున్నాయా అన్న సందేహాలు కొనసాగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: