గాయకుడు సిద్ శ్రీరామ్ ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్ స్టార్ గా మారిపోయాడు. ‘అల వైకుంఠపురంలో’ మూవీ కోసం అతడు పాడిన పాట ‘సామజవరగమన’ కు ఏకంగా 70 లక్షల లైకులు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి ఇతని గొంతు అంటే అల్లు అరవింద్ కు ఏమాత్రం నచ్చదట. 

గతంలో అరవింద్ విజయ్ దేవరకొండతో ‘గీతగోవిందం’ సినిమాను తీస్తున్నప్పుడు ఈ సింగర్ పాడిన ‘ఇంకేం ఇంకేం కావాలి’ పాటను విని ఆ పాట అతడు సరిగ్గా పాడలేదని తెలుగు పదాల ఉచ్చారణ కూడ బాగాలేదని దానితో ఆ పాటను వేరే సింగర్ చేత పాడించమని ఆ మూవీ దర్శకుడు పరుశు రామ్ కు చెప్పాడట. అయితే ఈ విషయాలను తెలుసుకున్న విజయ్ దేవరకొండ అల్లు అరవింద్ ను బ్రతిమాలి సిద్ శ్రీరామ్ పాడిన పాట గీతాగోవిందం’ మూవీలో ఉండేలా చేసాడట.

ఇప్పుడు ‘అల వైకుంఠపురంలో’ మూవీ విషయంలో కూడ సిద్ శ్రీరామ్ పాట వద్దని అరవింద్ వాదిస్తే అరవింద్ ను మళ్ళీ ఒప్పించి బన్నీ త్రివిక్రమ్ లు అతడి చేత ‘సామజవరగమన’ పాట పాడించారట. ఇప్పుడు ఈ పాట ఇన్ స్టంట్ హిట్ కావడంతో కేవలం ఈ పాట మ్యానియాను ఆధారంగా చేసుకుని ‘అల వైకుంఠపురంలో’ మూవీకి భారీ బిజినెస్ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈ న్యూస్ ఇలా వైరల్ కావడంతో అల్లు అరవింద్ ఇష్టపడని గొంతు అరవింద్ కు కాసులు కురిపిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ‘అల వైకుంఠపురంలో’ మూవీ బిజినెస్ ను ప్రభావితం చేసిన పాటగా ఈ పాట మారిపోయింది. ప్రస్తుతం తెలుగు స్పష్టంగా మాట్లాడటం వ్రాయడం పాడటం రాని వారికే ఎక్కువగా క్రేజ్ ఉంటోంది అన్న మాటలు నిజం అవుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: