యువరత్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన జైసింహా సినిమా మంచి విజయాన్ని నమోదు చేయడంతో, మరొక్కసారి బాలకృష్ణ, రవికుమార్ కు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్స్ గా నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ భూమిక ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు సి రామ్ ప్రసాద్ కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే దీని తరువాత బాలకృష్ణ  మరియు బోయపాటి శ్రీనుల కలయికలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. 

మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాతగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావడం జరిగింది. ఇక గతంలో బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుల కలయికలో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఆ సినిమాల మాదిరిగానే ఇందులో కూడా బాలకృష్ణ గారి లుక్ ఎంతో పవర్ఫుల్ గా ఉండనుందని టాక్. అయితే అందుకోసం ఇప్పటికే బాలకృష్ణ తన బాడీని ఎంతో స్లిమ్ గా తాయారు చేస్తున్నారని, 

దానికోసం ఆయన ప్రత్యేకంగా ఒక ఫిజికల్ ట్రైనర్ ని కూడా నియమించుకున్నట్లు సమాచారం. నందమూరి అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా అన్ని రకాల మాస్ మరియు కమర్షియల్ హంగులతో బోయపాటి ఈ సినిమాను నిర్మించదలిచారట. ఇటీవల రామ్ చరణ్ తో కలిసి తాను తీసిన వినయ విధేయ రామ సినిమా ఘోర పరాజయాన్ని అందుకోవడంతో, ఎలాగైనా ఈ సినిమాతో మంచి హొట్టాలని బోయపాటి కసితో ఉన్నారట. అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ మరియు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: