మీ పనిని గుర్తించి అభినందించినప్పుడు కలిగే అనుభూతి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ అభినందనలే ఇంకా ఇంకా బాగా పని చేయడానికి ఉత్సాహాన్నిస్తాయి. ఎవరి అండా లేకుండా ఒంటరిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. చాలా హార్డ్‌వర్క్‌ చేశాను. నా ముఖం మీదే తలుపులేసిన సందర్భాలున్నాయి.మీరు నా కెరీర్‌ని గమనిస్తే అది అర్థమవుతుంది. ఒకదానికి ఒకటి పోలిక లేని పాత్రలు చేసుకుంటూ వచ్చాను. ‘ఇలాంటి పాత్రలే చేయాలి’ అనే హద్దులను నటిగా చెరిపేయాలనుకున్నాను. నిర్మాతగా కూడా జస్ట్‌ కమర్షియల్‌ చిత్రాలకే పరిమితం కాదల్చుకోలేదు.

మా పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌పై తీసిన మరాఠీ చిత్రం ‘వెంటిలేటర్‌’కి మూడు నేషనల్‌ అవార్డులు వచ్చాయి. ఇంకా పంజాబీ, భోజ్‌పురి భాషల్లో కూడా మంచి సినిమాలు నిర్మించాం. ఇప్పుడు చిత్రపరిశ్రమ, ప్రేక్షకుల్లో చాలా మార్పు వచ్చింది.‘జై గంగాజల్‌’ (2016) తర్వాత హిందీ సినిమా చేయాలనుకున్నాను. చాలా కథలు కూడా విన్నాను. అప్పటికే అమెరికన్‌ టీవీ సిరీస్‌ ‘క్వాంటికో’ టెలికాస్ట్‌ కూడా మొదలైంది.చివరికి  ‘ది స్కై ఈజ్‌ పింక్‌’తో మళ్లీ హిందీ ప్రేక్షకులకు కనిపించాను. ‘కేర్‌టేకర్స్‌’ గురించి ఆలోచింపజేసిన కథ అది. నాకు తెలిసి వాళ్లను ఎవరూ గుర్తు పెట్టుకోరు. నాకు మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేని రోజులు గుర్తొచ్చాయి.


ఒక ఆర్టిస్ట్‌గా సినిమా చేసిన తర్వాత జస్ట్‌ ప్రమోట్‌ చేస్తే చాలు. వేరే ఏ బాధ్యతలూ ఉండవు. కానీ నిర్మాత బాధ్యత చాలా పెద్దది. ఒక సినిమాకి 150 మంది పని చేస్తున్నారంటే అందరి బాధ్యత ఒక్క నిర్మాతదే. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకూ చాలా పని ఉంటుంది. బరువైన బాధ్యత అయినా ఇష్టంగా చేశాను. ఎందుకంటే ‘ది స్కైజ్‌ ఈజ్‌ పింక్‌’ కథ అందరికీ చెప్పాలి.
ఈ సినిమాలో తల్లి తన కూతుర్ని చాలా ప్రేమిస్తుంది. ఓ ఫ్రెండ్‌లా ట్రీట్‌ చేస్తుంది. నిజజీవితంలో మా అమ్మ నాతో అలానే ఉంటారు.మేమిద్దరం కలిసి పార్టీలకు వెళతాం లేదా వేరే ఈవెంట్స్‌కి వెళతాం.నేను ఫుడ్‌ లవర్‌ని.

నాకు హైదరాబాదీ బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం.ముంబైకి దూరంగా ఉంటున్నాను. అయితే నేను ఎక్కడున్నా నా చుట్టూ నేను ప్రేమించేవాళ్లు ఉంటే చాలు..  నేను ఆనందంగా ఉంటాను. వైవాహిక జీవితం విషయానికి వస్తే... ప్రస్తుతం నా ‘విష్‌ లిస్ట్‌’లో ప్రధానంగా రెండు కోరికలు ఉన్నాయి. ఒకటి లాస్‌ ఏంజిల్స్‌లో ఇల్లు కొనడం.. రెండు.. తల్లి కావడం. 


మరింత సమాచారం తెలుసుకోండి: