యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్ గా నటించిన సినిమా సాహో. కథ పరంగా ఎన్ని విమర్శలు వచ్చాయో అంతకంటే ఎక్కువగా ప్రభాస్ లుక్ పైనే వచ్చాయి. చాలా సీన్లతో ప్రభాస్ తేలిపోయాడు. ప్రభాస్ – శ్రద్ధా కపూర్ కెమిస్ట్రీ కూడా అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుతం సాహో డిజిటల్ ప్లాట్ ఫాంలో అఫీషియల్ గా విడుదలైంది. దీంతో ఈ సినిమాపై మళ్లీ వార్తలు వస్తున్నాయి.



హై క్వాలిటీలో సాహోను ఇంట్లో చూస్తూండటంతో మళ్లీ ప్రభాస్ లుక్ పై విమర్శలు వస్తున్నాయి. దీంతో నెట్టింట్లో ప్రభాస్ పై అనేక కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. సినిమాలో ప్రభాస్ కు సంబంధించిన పిక్స్ తీసి నెట్ లో పోస్ట్ చేసి కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లను ప్రభాస్ స్ఫూర్తిగా తీసుకోవాలనీ.. ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్.. అరవైల్లో ఉండి కూడా ఫిట్ గా ఉంటున్నారు. గ్లామర్ పరంగా కూడా తాము చేసే సినిమాల్లో విమర్శలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఈ జనరేషన్ హీరో అయ్యుండి కూడా ప్రభాస్ తన సాహోలో లుక్ పరంగా తేలిపోయాడు. టాలీవుడ్ లో గ్లామర్ కే అధిక ప్రాధాన్యం ఇస్తారనేది తెలిసిన విషయమే.

 


బాహుబలి సిరీస్ తో ప్రభాస్ కు దేశవ్యాప్తంగా పేరు మారుమ్రోగిపోయింది. బాహుబలి ఇచ్చిన క్రేజ్ తో సాహోలో నటించాడు. కానీ ఆ క్రేజ్ ను సాహోతో నిలబెట్టుకోలేకపోయాడు ప్రభాస్. భారీ ఖర్చుతో, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మించిన ఈ సినిమా హిందీలో తప్ప అన్ని భాషల్లో ఫెయిల్యూర్ గా మిగిలింది. ఈ విమర్శలతో వచ్చే జాన్ సినిమాలో అయినా ప్రభాస్ తన లుక్ తో మెప్పిస్తాడేమో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: