టాలీవూడ్ ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరు ‘వర్షం’ సినిమాలో హీరో విలన్ లా నటించారు. ఆ సినిమాలో ప్రభాస్ హీరో అయితే గోపీచంద్ విలన్‌గా ఇరగదీసాడు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా ఆయనకంటూ ఒక స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు గోపీచంద్ హీరోగా ‘జిల్’ సినిమాను తన యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో కూడా నిర్మించాడు ప్రభాస్.


 ‘లౌఖ్యం’ సినిమా తర్వాత గోపీచంద్ హిట్టు కోసం ముఖం వాచిపోయాడు.  తాజాగా గోపీచంద్ హీరోగా నటించిన ‘చాణక్య’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు గోపీచంద్, నిర్మాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడుతో ఒక సినిమాకు పచ్చ జెండా ఊపేసాడు. తాజాగా బాక్సాఫీస్ దగ్గర గోపీచంద్ నటించిన ‘చాణక్య’ ఫలితాన్ని చూసి అతనితో సినిమా చేయాలన్న ఆలోచన విరమించుకున్నాడు హీరో గోపి చంద్.


ప్రస్తుతం గోపీ చంద్ చేతిలో సంపత్ నంది సినిమా ఒక్కటి మాత్రమే ఉంది. దాని పరిస్థితి ఏమిటి అన్నది ఇకపై చూడాలి. ప్రస్తుతం గోపీచంద్ కూడా ఏ సినిమా చేయాలి, ఏది చేయకూడదనే ఆలోచనలో పడినట్లు సమాచారం. మరోవైపు ప్రభాస్ తన స్నేహితుడు గోపీచంద్ కెరీర్ నిలబెట్టడానికి ఇద్దరు ముగ్గురు బడా దర్శకులతో కథలను రెడీ చేయిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 


ఈ రకంగా ప్లాపులలో ఉన్న గోపీచంద్‌కు ప్రభాస్ అండగా నిలబడుతూ స్నేహ ధర్మాన్ని పాటించే పనిలో పడ్డాడు. టాలీవుడ్ లో ఇంతక ముందు కూడా ఇలాంటి ప్రాణ స్నేహితులైన హీరో మిత్రు చాలానే ఉన్నారు. కానీ ఈ రేంజులో ఒక ప్రాణ స్నేహితుడికి సహాయం చేయడం మాత్రం అభినందదాయకమైన విషయమే అని చెప్పుకోవచ్చు. నిజంగా ప్రభాస్ లాంటి మిత్రుడు ఉండడం గోపి చంద్ అదృష్టమే.



మరింత సమాచారం తెలుసుకోండి: