ప్రముఖ సినీ నటి రోజా ఓవైపు రాజకీయాలు మరోవైపు జబర్దస్త్ షో తొ తీరిక లేకుండా ఉంది. అయితే ఒకప్పుడు అగ్ర తారగా వెలిగిన రోజా ఆ తర్వాత సినిమాలు చేస్తూనే రాజకీయాల్లో రాణించింది. ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరం పెట్టి జబర్దస్త్ కామెడీ షో జడ్జ్ గా అవతారమెత్తింది. వైసీపీ పార్టీలో చేరిన రోజా అటు జబర్దస్త్ షో నీ ఇటు రాజకీయాలని బాలన్స్ చేస్తూ వస్తోంది. పార్టీ లో చేరినప్పటి నుండి జగన్ వెన్నంటే ఉంటూ నగరి ఎమ్మెల్యే గా రెండుసార్లు విజయం సాధించింది రోజు. అయితే పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్ వెన్నంటే ఉండటంతో... తాజాగా జగన్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి కేటాయిస్తారని అనుకున్నారు అంతా ... కానీ రోజాకి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో అందరూ షాక్ కి గురయ్యారు. కానీ ఆ తర్వాత క్యాబినెట్ హోదా ఉండే ఏపీఐఐసీ చైర్మన్ పదవి దక్కింది రోజాకి . అయితే ఏపీఐఐసీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అటు జబర్దస్త్ లో డాన్సులు తగ్గించి కాస్త కామ్ అయింది.
అయితే కొన్నేళ్ళ కిందట సినిమాలకు గుడ్ బాయ్ చెప్పిన రోజా... మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబితోన్నారంటూ ఈమధ్య బాగా వార్తలు వస్తున్నాయి. బోయపాటి దర్శకుడిగా తెరకెక్కుతున్న సినిమాలో ఓ పవర్ఫుల్ విలన్ పాత్రలో రోజా నటించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా నటించబోతున్నారు. అయితే చిత్రబృందం మొత్తం విలన్ పాత్రలో రోజా నటిస్తే బాగుంటుందని భావించి ఆమెను సంప్రదించారని సమాచారం.
అయితే దర్శకుడు బోయపాటి శ్రీను సినిమాలో హీరోలు విలన్లు పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే .కాగా ఈ సినిమాలో విలన్ పాత్ర బాగుండడంతో రోజా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ తో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో కూడా ఉన్నారట రోజా . ఇదిలా ఉండగా గతంలో నందమూరి బాలకృష్ణ... రోజా ఏడు సినిమాల్లో జోడీగా నటించారు. పరమవీరచక్ర, శ్రీరామరాజ్యం సినిమాలో రోజా గెస్ట్ పాత్రలో నటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే రోజా కి విలన్ పాత్రలు కొత్తేమి కాదు ఇప్పటికే కొన్ని సినిమాల్లో పవర్ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించింది. మరి బోయపాటి బాలయ్య కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో విలన్ పాత్ర చేయడానికి రోజా ఓకే చెబుతుందా లేక ఆఫర్ ని తిరస్కరిస్తుందా చూడాలి మరి.