ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటించిన సాహో సినిమా ఆగస్టు నెల 30వ తేదీన విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడినప్పటికీ సినిమా విడుదలైన తరువాత సాహో ఆ అంచనాలు అందుకోలేకపోయింది. దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో సాహో సినిమాను యువి క్రియేషన్స్ నిర్మాతలు తెరకెక్కించారు. ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల వరకు నిర్మాతలకు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. 
 
బాలీవుడ్ లో సాహో సినిమాకు భారీగా లాభాలు వచ్చినా మిగతా అన్ని చోట్ల ఈ సినిమాకు నష్టాలు తప్పలేదు. ఇప్పుడు సాహో సినిమా ప్రభావం ప్రభాస్ జాన్ సినిమాపై పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను యువి క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మొదట ఈ సినిమాను 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్మాతలు అనుకున్నారు. 
 
కానీ సాహో సినిమా ఫలితం తరువాత ప్రభాస్ జాన్ సినిమా బడ్జెట్ ను 180 కోట్ల రూపాయల నుండి 120 కోట్ల రూపాయలకు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నాడని సమాచారం. ప్రభాస్ కు జోడీగా పూజా హెగ్డే ఈ సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 25 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. జిల్ ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఆస్ట్రాలజర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. 
 
నవంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం అందుతుంది. 2020 దసరాకు ఈ సినిమా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ప్రభాస్ పుట్టినరోజు కానుకగా జాన్ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండవని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: