టాలీవుడ్ కి చెందిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో వివాదాలు, ఆధిపత్యపోరు నిత్యకృత్యం. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏదొక వివాదం జరుగుతూనే ఉంటుంది. నివురుగప్పిన నిప్పులా ఉండే ‘మా’ విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. నేడు జరిగిన ‘మా’ సమావేశం తీరుపై నటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మా అధ్యక్షఉడు నరేశ్ లేకుండా ఈ సమావేశం జరిగింది.

 

 

‘నేను రాజీనామా చేస్తా.. నాకు ఈసీ మెంబర్ పదవి అక్కర్లేదు. 400 సినిమాలకు కథలు రాసిన పరుచూరికి అవమానం జరిగింది. పరుచూరి కంటతడి పెడుతూ వెళ్లిపోయారు. మా ఎన్నికల్లో గెలిచినందుకు బాధపడాలో ఆనందపడాలో తెలియడం లేదు. ఎవరికి వారు గ్రూపులు పెట్టుకున్నారు. ఏం మాట్లాడినా జీవిత, రాజశేఖర్ తప్పుపడుతున్నారు. సభ్యుల సాధకబాధలు గురించి మాట్లాడకపోవడం బాధించింది. శివాజీరాజా ప్యానల్ మీద గెలిచాం. 18మంది మెజారిటీ సామాన్యమైన విషయం కాదు. ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు గడిచిపోయాయి. జీవిత, రాజశేఖర్, బెనర్జీ.. లాంటి వారు ఉండి కూడా ప్రయోజనం లేకపోయింది. గతంలో జరిగిన విషయాలపై విమర్శలు చేసుకోవడం అనవసరం. ప్రతి ఒక్కరూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పదవిలా ఫీలవుతున్నారు. సభ్యులందరూ ఎందుకు మీటింగ్ వచ్చామో అర్ధంకాని పరిస్థితిలో ఆవేశంగా వెళ్లిపోతున్నారు’ అంటూ ఈ సమావేశంపై ఘాటు విమర్శలే చేశారు. సీని పెద్దలు అల్లు అరవింద్, దిల్ రాజు.. వంటి వారు ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

 

 

గతంలో జరిగిన ఈవెంట్లకు సంబంధించి ఆరోపణలు జరిగాయని అంటున్నారు. శివాజీరాజా – జీవిత, రాజశేఖర్ మధ్య రెండు గ్రూపుల మధ్య విబేధాలు ఉన్నాయనే ఆరోపణలూ ఉన్నాయి. జనరల్ మీటింగ్ అంటూ జనరల్ బాడీ మీటింగ్ పెట్టారని విమర్శలు వస్తున్నాయి. మా అధ్యక్షుడు నరేశ్ లేకుండా ఈ మీటింగ్ ఎలా నిర్వహిస్తారనే దానిపై కూడా విమర్శలు వస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: