ఈ వారం హౌస్ లోకి కంటెస్టెంట్స్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకువచ్చి వారిలో ఆహ్లాదం నింపిన బిగ్ బాస్ మరోమారు ఆ ప్రయత్నం చేశారు. అయితే ఈ సారి డైరెక్ట్ గా వారిని కలిసే వీలు లేకుండా  స్టేజి మీద నుండే వారితో మాట్లాడే అవకాశం మాత్రమే ఇచ్చాడు. అయితే ఇలా గెస్ట్ గా వచ్చిన వారిలో సెలెబ్రిటీలు కూడా ఉన్నారు. ఆలీ స్నేహితుడిగా యాంకర్ రవి వచ్చాడు. ఆయన ఉన్నంత సేపు ఎంటర్ టైన్ చేశాడు. ఇక రాహుల్ స్నేహితుడిగా సింగర్ నోయల్ వచ్చాడు.


అయితే రాహుల్ స్నేహితుడిగా వచ్చిన నోయల్ పెద్ద తప్పు చేసినట్టుగా భావిస్తున్నారు. నోయల్, రాహుల్ బాగా ఆడుతున్నాడని, అలాగే ఆడాలని కోరుకున్నాడు. అయితే రాహుల్ కి బద్దకం అని అందరికీ తెలుసు. టాస్క్ లలో గానీ, హౌస్ లోగానీ అతని బద్దకం గురించి అందరికీ తెలుసు. ఈ విషయాన్ని రాహుల్ వాళ్ల అమ్మ కూడా చెప్పింది. అయితే ఆ పాజిటివ్ వేలో చూపిస్తూ ఒక పిట్ట కథ చెప్పాడు.


మనందరికీ తెలిసిన తాబేలు, కుందేలు కథ గురించి వివరించి నువ్వు తాబేలు లాంటి వాడివని అంటాడు. అంటే మిగతా అందరూ కుందేలు లాంటి వారనే అర్థం. ముఖ్యంగా ఈ విషయంలో అది శ్రీముఖికే వర్తిస్తుంది. ఎందుకంటే హౌస్ లో ఆక్టివ్ గా ఉండేది ఆమె ఒక్కతే. హౌస్ లో వాళ్ళు వాళు ఎన్ని గొడవలైనా పడుతుండవచ్చు. కానీ బయట వ్యక్తి మిగతా హౌస్ మెంబర్స్ ని విమర్శించడం సరికాదని అంటున్నారు.


వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎంతైనా పొగుడుకోవచ్చు. కానీ అవతలి వాళ్లని అనే ముందు ఆలోచించుకోవాలనీ, ఏది పడితే అది అని నోరు పారేసుకోవడం మంచి కాదు. ఇప్పటికే రాహుల్ కి లూజ్ టంగ్ అనే పేరు ఉంది. ఇప్పుడు నోయల్ కూడా ఇలా అనడంతో అతనికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: