ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో ఎమోషనల్ గామారిపోయింది. అందువల్ల నాగార్జున ప్రశ్నలు అడగడానికి వీలు లేకుండా పోయింది. కానీ నామినేషన్ ప్రక్రియలోనే చాలా ప్రశ్నలు దాగి ఉన్నాయి. అయితే ఆ నామినేషన్ ప్రక్రియలో జరిగిన గొడవల వల్ల ప్రేక్షకుల్లో కొన్ని ప్రశ్నలు మిగిలిపోయాయి. వాటిని నాగార్జున అడిగి సమాధానం రాబడతాడని అందరూ అనుకున్నారు. నాగార్జున ఆ విషయాలని సాల్వ్ చేయడంలో విఫలమయ్యాడని భావిస్తున్నారు.


వారం మొత్తంలో జరిగిన తప్పులని ఎత్తి చూపి పరిష్కారాలు రాబట్టాలని భావించిన వారికి నిరాశే మిగిలింది. ఈ ఎపిసోడ్ లో మూడూ విషయాల్లో నాగార్జున తప్పు చేసినట్లుగా తెలుస్తుంది. మొదటగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ రద్దయి హౌస్ మేట్స్ అందరూ నామినేషన్ లో ఉండడానికి గల కారణం ఎవరనేది చెప్పలేదు. ఈ విషయంలో ఎవరికి వారు మేం కారణం కాదు అను అనుకుంటున్నారు. శివజ్యోతి, వరుణ్ ల మధ్య గొడవ వల్లే ఇలా జరిగిందని అందరికీ తెలుసు.


కానీ ఆ గొడవకి దారి తిసిన పరిస్థితులని చర్చించి తప్పెవరిదో చెప్తాడని భావించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు.  వరుణ్, శివజ్యోతిల వాదనలు విన్నాడు తప్పితే ఎవరిది తప్పనే విషయం తేల్చలేకపోయాడు. ఇక రెండోది, రాహుల్, శ్రీముఖిల విషయం. బయట స్నేహంగా మెలిగే వీరిద్దరూ బిగ్ బాస్ హౌస్ లో బద్ద శత్రువులుగా మారిపోయారు. నామినేషన్ ప్రక్రియలో వీళ్ళెంత గొడవ పడ్డారో అందరూ చూశారు. అయితే ఈ గొడవలో తప్పెవరిదనేది నాగార్జున చెప్పాలని అనుకున్నారు.


కానీ నాగార్జున వీరిద్దరి మధ్య గొడవని ఇంకా పెద్దది చేసేలా చేశారు. అసలు టాపిక్ మర్చిపోయి వేరే ఏదో టాపిక్ రావడంతో ఆ గొడవ సాల్వ్ అవ్వలేదు. దీంతో రాహుల్, శ్రీముఖిల అభిమానులు అసహనానికి గురవుతున్నారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో తప్పులు ఎత్తి చూపబడ్డాయే తప్ప వాటికి పరిష్కారం మాత్రం దొరకలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: