టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా, ఆడియన్స్ ఆశించిన అంచనాలు అందుకోలేక ఓవర్ ఆల్ గా యావరేజ్ సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. మన రెండు తెలుగు రాష్ట్రాలు సహా పలు ప్రాంతాల్లో నష్టాలు మిగిల్చిన ఈ సినిమా, ఓవర్సీస్ మరియు ఉత్తరాదిన మరింతగా నష్టాలు చవి చూసినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మెగాస్టార్ స్వతంత్ర సమరయోధుడిగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన నయనతార జోడి కట్టగా, తమన్నా మరియు అనుష్క, నిహారిక ఇతర పాత్రల్లో నటించడం జరిగింది. 

మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఇకపోతే ఈ సినిమా తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా అధికారిక పూజ కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాకు కమర్షియల్ సినిమాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు తొలుత భారీగానే ఖర్చు చేయాలని భావించారట నిర్మాతలు. 

అయితే సైరా సినిమాకు వచ్చిన ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాకు అవసరం అయిన మేరకు మాత్రమే జాగ్రత్తగా ఖర్చుపెట్ట దలిచారట. అయితే సినిమా మాత్రం చాలా గ్రాండియర్ గానే ఉంటుందని, కాకపోతే కాస్ట్ కంట్రోల్ విషయంలో మాత్రం ఒకింత గట్టిగా ఈ సినిమా యూనిట్ వ్యవహరించనుందని సమాచారం. వీలైనంతవరకు మొత్తం సినిమాకు చాలా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించాలని భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. అతి త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా వివరాలు మరికొద్దిరోజుల్లో వెల్లడి కానున్నాయి. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష సెలెక్ట్ అయినట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: