బాహుబలి ద్వారా తెలుగు సినిమా దశ దిశను మార్చిన దర్శకుడు రాజమౌళి. తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేసిన ఘనత ఈ దర్శక ధీరుడిదే. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గౌరవాన్ని పెంచిన దర్శకుడాయన. మన సినిమాకు అంత బడ్జెట్ పెడితే డబ్బులు వస్తాయో రావో అని సందేహిస్తున్న రోజుల్లో అప్పటి మన ఖర్చుకి మించి నాలుగింతలు ఖర్చు పెట్టి, ఆ ఖర్చు పెట్టిన దానికి నాలుగింతలు వసూలు చేసిన ఘనుడాయన.


బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గతి మారిపోయింది. బాలీవుడ్ వాళ్ళు సైతం అంత బడ్జెట్ కి భయపడి సినిమా తీయలేని రోజుల్లో మన తెలుగు సినిమాని శిఖరాగ్రాన నిలబెట్టిన దర్శకుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో ఇండియన్ ఫిలిమ్ హిస్టరీలో ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టాడు. ఒక అనువాద చిత్రంగా కాకుండా ఇండియన్ సినిమాగా పేరొందిన చిత్రం బాహుబలి. బాహుబలి రికార్డుల గురించి చెప్పాలంటే సమయం సరిపోదు.


ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్ ని తో వచ్చిన ఈ  దృశ్యకావ్యానికి ఎన్నో పురస్కారాలు వచ్చాయి. తాజాగా ఈ చిత్రం మరో ఘనతని సొంతం చేసుకుంది. లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్రం ప్రదర్శింపబడుతుంది. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా? అయితే చదవండి. ఇప్పటి వరకు ఈ హాల్ లో అన్నీ ఇంగ్లీష్ చిత్రాలే ప్రదర్శింపబడ్డాయి.


మొట్ట మొదటిసారి ఒక ఇంగ్లీషేతర చిత్రమైన బాహుబలి ఈ హాల్ లో ప్రదర్శింపబడటం రికార్డు కాకపోతే మరేమిటి. అంతే కాదు ఈ హాల్ లో రాజమౌళి సాంప్రదాయ పంచె కట్టులో మెరిశాడు. భుజం మీద కండువాతో కనిపించి కనువిందు చేశాడు. తెలుగు సినిమాను ప్రపంచానికి పరిచయం చేయడమే కాదు ఆ ప్రపంచ వేదికపై తెలుగు సాంప్రదాయాన్ని కూడా పరిచయం చేశాడు. మొత్తానికి బాహుబలి సినిమాతో వహ్వా అనిపించిన రాజమౌళి పంచెకట్టుతో వారెవా అనిపించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: