తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 మొదలై ఇప్పటికే 13 వారాలు పూర్తి చేసుకుంది. మొదటి రెండు సీజన్లతో పోలిస్తే సీజన్ 3 ప్రేక్షకుల్ని అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. హోస్ట్ గా నాగార్జున బాగానే అకట్టుకుంటున్నా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీలు మాత్రం ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అందించటం లేదు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడుగురు ఉన్నారు. ఈ వారం వినిపిస్తున్న వార్తల ప్రకారం వితికా షేరు ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. 
 
మిగిలిన ఆరుగురు ఇంటి సభ్యులలో అలీ రీ ఎంట్రీ కాబట్టి అలీ విన్నర్ అయ్యే అవకాశం ఉండదు. శివజ్యోతి మీద కూడా ప్రేక్షకుల్లో కొంత వ్యతిరేఖత ఉంది. ఈ వారం ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే వితికా షేరుతో పాటు శివజ్యోతి ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ సందేశ్ టాప్ 3లో ఉండే అవకాశాన్ని తన భార్య వితిక వలనే కోల్పోతున్నాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్ ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఫైనల్ విన్నర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి ఫ్యాన్స్ శ్రీముఖిని గెలిపించటం కొరకు విపరీతంగా కష్టపడుతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఎవరికీ శ్రీముఖికి ఉన్నంత సోషల్ మీడియా ఫాలోయింగ్ ఐతే లేదు. రియాలిటీ షోలతో వచ్చిన గుర్తింపు కూడా శ్రీముఖికి బాగా ప్లస్ అవుతోంది. 
 
రాహుల్ సిప్లిగంజ్ చాలా సార్లు ఎలిమినేషన్ కు నామినేట్ అయినా ప్రతిసారి రాహుల్ ను అతని ఫ్యాన్స్ సేవ్ చేసుకుంటూ వచ్చారు. టాస్కులు సరిగ్గా ఆడకపోయినా రాహుల్ జెన్యూన్ గా ఉంటాడనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అదే రాహుల్ కు ప్లస్ అవుతోంది. బాబా భాస్కర్ ఈ షోకు రాకముందు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా ఈ షోలోకి వచ్చాక మాత్రం బాబాకు ప్రత్యేకంగా అభిమానులు ఏర్పడ్డారు. బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా అందించింది బాబా భాస్కర్ అని బాబా ఫ్యాన్స్ చెబుతున్నారు. మరి ఈ ముగ్గురిలో విన్నర్ ఎవరు అవుతారో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: