బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్ గత కొద్దికాలంగా సరైన సక్సెస్ లేక ఎంతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల మరొక నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో ఆయన నటించిన భారీ మల్టి స్టారర్ సినిమా వార్. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, మొదటి రోజున కొంత మిక్స్డ్ రివ్యూస్ ని సంపాదించడం జరిగింది. సినిమాలో టూ మచ్ గా యాక్షన్ ఉందని, కొన్ని సీన్లు పెద్దగా ఆకట్టుకునేలా లేవని, అలానే లెంగ్త్ ఎక్కువ అయింది అంటూ కొద్దిపాటి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, రెండవ రోజు నుండి ప్రేక్షకులు ఆ సినిమాకు విపరీతంగా కనెక్ట్ అయ్యారు. 

ముఖ్యంగా మాస్ మరియు యువత వార్ సినిమా కలెక్షన్స్ పెంచడంలో కీలక పాత్ర పోషించారని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. హృతిక్ మరియు టైగర్ లు గురు శిష్యులుగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా వాణి కపూర్ నటించింది. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిలిమ్స్ వారు అత్యంత భారీ ఖర్చుతో నిర్మించిన ఈ సినిమాకు అబ్బాస్ టైర్ వాలా కథను అందించడం జరిగింది. ఇక నేడు ట్రేడ్ విశ్లేషకుల నుండి అందుతున్న లెక్కల ప్రకారం, ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్ కు కేవలం రూ. 4.25 కోట్లకు మాత్రమే చేరువలో ఉందని సమాచారం. ఇక రేపటితో ఈ సినిమా రూ.300 కోట్ల కలెక్షన్ మార్క్ ని అందుకోవడం ఖాయమని అంటున్నారు. 

ఈ విధంగా అక్కడ ఈ ఏడాది సూపర్ హిట్ కొట్టిన కబీర్ సింగ్ సినిమా లైఫ్ టైం కలెక్షన్ ని కేవలం 20 రోజుల్లోనే వార్ బీట్ చేసి, 2019లో రిలీజ్ అయిన చిత్రాల్లో నెంబర్ వన్ గా అలానే, ఓవర్ ఆల్ గా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లు అందుకున్న సినిమాల్లో 7వ సినిమాగా సరికొత్త రికార్డుని నెలకొల్పుతోందట. దీనితో ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురు చూసిన హృతిక్ కి కెరీర్ పరంగా వార్ సినిమా మంచి బ్రేక్ లభించిందని, దీని తరువాత హృతిక్ తో పాటు టైగర్ మార్కెట్ కూడా మరింతగా పెరగనుందని అంటున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: