తన స్టైల్ యాక్టింగ్ తో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. స్టైల్ గా అల్లు అర్జున్ స్టెప్పులు చేస్తుంటే అభిమానులందరూ హుషారెత్తి పోతుంటారు . అయితే అల్లు అర్జున్ కెరీర్లో జులాయి  సన్నాఫ్ సత్యమూర్తి అనే  సినిమాలు మంచి విజయాన్ని అందుకున్న విశాతం తెలిసిందే . అయితే ఈ రెండు  సినిమాలు అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చాయి. కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కలయిక తో అలా వైకుంటపురం అనే సినిమా రాబోతోంది. కాగా దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అయితే తాజాగా అలా  వైకుంఠపురం సినిమా నుంచి విడుదలైన సామజవరగమనా పాట యూట్యూబ్లో ఎక్కువ లైకులు ఉన్న పాట రికార్డు సృష్టించింది. 

 

 

 

 

 ప్రస్తుతం ఎవరి మొబైల్లో చుసిన  ఇదే పాట...  ఎవరి నోట విన్న ఇదే పాట . అయితే రేపు సాయంత్రం మరో పాటను ఈ సినిమా నుంచి విడుదల చేయబోతున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. అయితే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై  భారీ విజయాన్ని నమోదు చేస్తుందని  అభిమానులు భావిస్తున్నారు. అయితే అలా వైకుంటపురం సినిమాలో  అల్లు అర్జున్ తో పాటు సుశాంత్ మరో హీరోగా నటిస్తున్నారు.

 

 

 

 తాజాగా ఈ చిత్రబృందం  సుశాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ అనే పాత్రలో నటిస్తున్నాడు. కాగా  చిత్రబృందం  విడుదల చేసిన పాత్రలో సుశాంత్  క్లాస్ లుక్ తో కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో అందాల భామ కాజల్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది.కాగా గీత ఆర్ట్స్ అండ్ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో అలా  వైకుంఠ పురం చిత్రం నిర్మించబడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: