బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ఎంటర్టైన్ మిస్సైంది.. ఆ విషయం మొదటి రెండు వారాల్లోనే తెలిసింది.. అందుకే ఈ సీజన్ చూడట్లేదు.. ఇంతకీ ఇలా చెబుతున్నది ఎవరో తెలుసా బిగ్ బాస్ తెలుగు టైటిల్ విన్నర్ శివ బాలాజి. అదేంటి అతను టైటిల్ విన్నర్ అయ్యుండి బిగ్ బాస్ చూడట్లేదని చెబుతాడా అంటే బోర్ కొడితే ఎవరు మాత్రం ఏం చేస్తాం చెప్పండి.


బిగ్ బాస్ సీజన్ 1 తెలుగు హోస్ట్ గా ఎన్.టి.ఆర్.. కంటెస్టంట్ గా శివ బాలాజి, ఆదర్శ్, ప్రిన్స్, సంపూర్ణేష్, ముమైత్ ఖాన్, హరితేజ, నవదీప్, దీక్షా పంత్ ఇలా క్రేజీ కంటెస్టంట్స్ వచ్చారు. అంతేకాదు బిగ్ బాస్ మొదటి సీజన్ కాబట్టి ప్రతి టాస్క్ చాలా కొత్తగా అనిపించింది. నామినేషన్స్, ఎలిమినేషన్స్ అంతా ఆడియెన్స్ కు భలే థ్రిల్ ఇచ్చాయి.


ఇదిలాఉంటే సీజన్ 2 కి వచ్చే సరికి షో ఎలా ఉంటుందో ఆడియెన్స్ కనిపెట్టారు. అయినా కూడా నాని హోస్టింగ్ టాలెంట్ తో పాటుగా కౌశల్ వల్ల సెకండ్ సీజన్ కూడా సూపర్ హిట్టైంది. సెకండ్ సీజన్ లో గీతా మాధురి, తనీష్, తేజశ్వి లాంటి వారంతా ఆకట్టుకున్నారు. ఇక సీజన్ 3 విషయానికి వస్తే మాత్రం బుల్లితెర సెలబ్రిటీస్ కు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు.


కంటెస్టంట్స్ 15 మందిలో నలుగురు స్మాల్ స్క్రీన్ ఆర్టిస్టులు.. ఇద్దరు యాంకర్లు.. ఒక సింగర్ ఇలా ఈ సీజన్ నడిపించారు. చివరి దశలో ఉన్న ఈ సీజన్ లో ఎవరు విన్నర్ అన్నది చెప్పడం కష్టం కాని ఈ సీజన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయలేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 1 విన్నర్ శివ బాలాజి ఇంత డైరెక్ట్ గా చెప్పడం మాత్రం అందరికి షాక్ ఇచ్చింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: