టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తో అదిరిపోయే హిట్ అందుకున్న సందీప్ రెడ్డి వంగా ఓవర్ నైట్ లోనే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ బ్లాక్ బస్టర్ అయిన సందర్భంలో చాలామంది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు సందీప్ రెడ్డి వంగా తో చేయడానికి రెడీ అయ్యారు. అంతేకాకుండా ఆ సమయంలో మహేష్ బాబు కి సందీప్ రెడ్డి వంగా స్టోరీ కూడా వినిపించినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అర్జున్ రెడ్డి సినిమాని రీమేక్ చేయడం జరిగింది. బాలీవుడ్ లోకి కబీర్ సింగ్ గా తెరకెక్కించిన ఈ సినిమా అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ అందుకుంది.


అంతేకాకుండా వరుస ఫ్లాపుల్లో ఉన్న షాహిద్ కపూర్ కి ఈ సినిమాతో మంచి విజయం లభించింది. అంతేకాకుండా అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వందకోట్లకు చేరిన సినిమాగా అర్జున్ రెడ్డి అదిరిపోయిన హిట్ అందుకుంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మరియు అదే విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయడానికి హీరోలు ఎప్పుడు కావాలంటే అప్పుడు డేట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.


ఇటువంటి క్రేజ్ కలిగిన మోస్ట్ వాంటెడ్ గా హీరోలకు ఉన్న సందీప్ రెడ్డి వంగా కు మాత్రం మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలా కోరికగా ఉందట. ఇప్పటికే తన వద్ద చిరంజీవి ప్రస్తుత ఏజ్.. బాడీలాంగ్వేజ్ కు తగ్గ ఒక కథ ఉందని.. ఆయనకు ఒక్కసారి కథ చెప్పినా చాలని సన్నిహితులతో అంటున్నాడట. చిరంజీవి సినిమా చేసేందుకు ఒప్పుకోకున్నా తన కథ విన్నా చాలంటూ సందీప్ వంగా చాలా గట్టిగా కోరుకుంటున్నట్లు ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్.  



మరింత సమాచారం తెలుసుకోండి: