టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాల రెండు భాగాల అద్భుత సక్సెస్ తరువాత మన దేశంతో పాటు విదేశాల్లో కూడా విపరీతమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించడం జరిగింది. అయితే అదే ఊపులో కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన ఆయన లేటెస్ట్ సినిమా సాహో, ఎంతో భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కినప్పటికీ, సాధారణ ప్రేక్షకుడిని మెప్పించే విధంగా మాత్రం తెరకెక్కలేదు. తొలిరోజు తొలిఆట నుండి నెగటివ్ టాక్ సంపాదించిన సాహో సినిమా, చాలావరకు ప్రేక్షకులను నిరాశ పరిచింది. 

ఇకపోతే ఆయన నటించిన బాహుబలి సినిమాను నిన్న లండన్ లోని  రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రత్యేకంగా ప్రదర్శిస్తున్న సందర్భంగా హీరో ప్రభాస్, హీరోయిన్ అనుష్క, నటుడు రానా, దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, తదితరులు ఈ స్పెషల్ షోకి హాజరయి, అక్కడి ప్రేక్షకులను ఎంతో ఉత్సాహపరిచారు. అయితే షో బిగినింగ్ కి ముందుగా అక్కడి మీడియాతో కాసేపు ఇంటరాక్ట్ అయిన బాహుబలి టీమ్, వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ పలు ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. 

అయితే ఆ సందర్భంగా ప్రభాస్ మరియు అనుష్కలపై మన మీడియా కూడా బాగానే ఫోకస్ చేస్తూ, మరొక్కసారి వారిద్దరి మధ్యన ఏదో ఉందని, అయితే అది మీడియాకు తెలియకుండా వారిద్దరూ రిలేషన్షిప్ ని ఎంతో సీక్రెట్ గా మెయింటెయిన్ చేస్తున్నారు అంటూ అప్పుడే కొన్ని మీడియా మాధ్యమాల్లో వార్తలు రావడం మొదలయ్యాయి. అయితే ఎప్పటివలె మళ్ళి అనుష్క మరియు ప్రభాస్ ల మధ్య లవ్ అఫైర్ పై వార్తలు ప్రచారం అవుతున్నాయని, ఎన్నిసార్లు వారిద్దరూ తమ మధ్యన ఏమి లేదని చెప్పినా, ఇటువంటి ప్రచారాలు ఎందకు ఆగడం లేదో అర్ధం కావడం లేదని, పలువురు ప్రభాస్ మరియు అనుష్క ఫ్యాన్స్, తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో అసహనం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: