స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అలా వైకుంఠపురంబులో’. నాపేరు సూర్య దారుణంగా ఫ్లాప్ కావడంతో చాలా టైం తీసుకుని ‘అలా వైకుంఠపురంబులో’ అనే సినిమా ప్రాజెక్టు బన్నీ ఒప్పుకోవటం జరిగింది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని నిర్ణయించుకున్న బన్నీ ఈ సినిమాని గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో మెల్లగా సినిమా పాటల ద్వారా ప్రమోషన్ కార్యక్రమాలు సినిమా యూనిట్ మొదలు పెట్టింది. దీంతో సినిమాలో సామజ వర గమన అనే సాంగ్ తో ప్రమోషన్ చెరువు చేసి సాంగ్ రిలీజ్ చేసి అదిరిపోయే రికార్డులు యూట్యూబ్ లో సృష్టించడం జరిగింది.


దీంతో ఈ సాంగ్ కి అదిరిపోయే రీతిలో తమన్ మ్యూజిక్ అందించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటుగా నటిస్తున్న అక్కినేని సుశాంత్ పోస్టర్ ఒకటి సినిమా యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. ‘అల వైకుంఠపురములో’ సినిమాలో సుశాంత్ పాత్ర పేరు రాజ్. “రాజ్ నవ్వితే ఎలాంటివాళ్లయినా ఆకర్షితులవ్వాల్సిందే” అంటూ క్యాప్షన్ కూడా పెట్టారు.


ఇందులో సుశాంత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సుశాంత్ అల్లు అర్జున్ కి ఫ్రెండ్ గా నటిస్తున్నాడని సమాచారం. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక కాగా, నివేదా పేతురాజ్ మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. మరియు అదే విధంగా ఈ సినిమా లో సీనియర్ హీరోయిన్ టబు చాలా కాలం తర్వాత ఈ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దీంతో సినిమాపై టాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు తెలుగు సినిమా ప్రేమికులకు కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తారీకున ఈ సినిమా విడుదల కానుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: