బిగ్ బాస్ వీక్షకులకు ఓ ఉత్కంఠ వీడిపోయింది. ఈ వారం ఎవరు ఎలిమినేట్‌ అవుతారా అని టెన్షన్ తో ఉన్నవారికి నాగార్జున జవాబు చెప్పేశాడు.. బిగ్‌బాస్‌ - సీజన్‌3 నుంచి నటి, వరుణ్‌ సందేశ్‌ భార్య వితిక ఎలిమినేట్‌ అయ్యింది. ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో వితికే అతి తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్ అయినట్టు.. నాగార్జున ఎనౌన్స్ చేసేశారు.


శనివారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే.. ఎలిమినేషన్ లో ఉన్న సభ్యుల కుటుంబ సభ్యులను ‘ఆరు, ఏడు స్థానాల్లో ఎవరు ఉంటారు’ అని నాగార్జున ప్రశ్నించారు. ఎక్కువమంది లాస్ట్ ప్లేస్ వితికదే అని చెప్పేశారు. ఉన్న ఏడుగురిలో శ్రీముఖి, రాహుల్‌, బాబా భాస్కర్‌ సేఫ్‌ అని నాగ్ ఎనౌన్స్ చేశారు. ఇంకా నలుగురు మిగిలారు. వారిలో వితికకే అతి తక్కువ ఓట్లు వచ్చాయి.


ఇక ఎలిమినేట్ అయిన వితిక గురించి చెప్పుకోవాలంటే.. ఆమె నటుడు వరుణ్ సందేశ్ భార్య అన్న సంగతి తెలిసిందే. అసలు ఈ సీజన్ లోనే షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన జంట వరుణ్‌ సందేశ్‌-వితిక. పెద్దగా సినిమాలు లేకపోయినా వరుణ్‌ సందేశ్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఆ అభిమానుల అభిమానమే వితికకు ఇప్పటి వరకూ సాయపడుతూ వచ్చింది. అయితే పోటీ చివరకు దశకు చేరడంతో ఇప్పుడు ఆ ఫ్యాన్స్ సపోర్ట్ సరిపోవడం లేదు. వీరితో పోలిస్తే.. శ్రీముఖి, రాహుల్‌, బాబా భాస్కర్‌, శివజ్యోతికు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. అందులోనూ లాస్ట్ వీక్ అందరూ నామినేట్‌ అయ్యారు.


సో.. వరుణ్ సందేశ్ ఫ్యాన్స్.. అతడినో, అతడి భార్యనో ఎవరినో ఒకరికే ఓటేసే అవకాశం ఉంది. సో.. ఆటోమేటిక్ గా వారు వరుణ్‌ సందేశ్‌కు ఓట్లు వేసేశారు. దీంతో వితికకు అతి తక్కువ ఓట్లు వచ్చాయి. ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: