టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా ఇటీవల ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి విభిన్నమైన కథా చిత్రాలను తీసి ప్రేక్షకులను ఆకట్టుకున్న యువ దర్శకుడు విఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా డిస్కో రాజా. తన గత సినిమాల మాదిరి ఆనంద్, ఈ సినిమాను కూడా ఒక వెరైటీ పాయింట్ తో తెరకెక్కిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇక రవితేజ కూడా ఇంతవరకు తన కెరీర్ లో పోషించని ఒక సరికొత్త పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. 

ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మాతగా రూపొందుతున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ స్వరపరచిన ఈ సినిమాలోని నువ్వు నాతో ఏమన్నవో అనే సాంగ్, నిన్న యూట్యూబ్ లో రిలీజ్ అయి, శ్రోతలను విశేషంగా అలరిస్తూ ఇప్పటికే 1 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుని ముందుకు సాగుతోంది. 

మంచి రెట్రో ఫీల్ తో ప్రముఖ గాయకులు ఎస్పీ బాలు గాయాలు ఆలపించిన ఈ సాంగ్ కు శ్రోతలు బ్రహ్మరథం పడుతున్నారు. మంచి మెలోడియస్ బీట్ గా సాగే ఈ సాంగ్ కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించిన సాహిత్యం మరింత అందాన్నిచ్చిందనే చెప్పాలి. రాజా ది గ్రేట్ సినిమా తరువాత కెరీర్ పరంగా ఇప్పటివరకు సరైన సక్సెస్ లేని రవితేజకు ఈ సినిమాతో సక్సెస్ రావడం ఖాయమని, ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ మంచి హిట్ అవడంతో, ఆయన సక్సెస్ కు పునాది పడ్డట్లే అని అంటున్నారు. మరి ప్రస్తుతం మంచి అంచనాలు ఏర్పరుచుకున్న డిస్కో రాజా, రేపు రిలీజ్ తరువాత ఎంత మేర విజయాన్ని అందుకుంటాడో చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: