మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో టాలీవుడ్ సినిమాకు నటుడిగా మళ్ళి రీఎంట్రీ ఇచ్చి, ఆ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత కొద్దిరోజుల క్రితం ఆయన స్వాతంత్రోద్యమ వీరుడిగా నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ ని సంపాదించడం జరిగింది. సినిమాలోని కథ మరియు కథనాలు ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోప్పటికీ, సినిమాలో మెగాస్టార్ తన అత్యద్భుమైన నటనతో ప్రేక్షకులను అలరించారు అనే చెప్పాలి. ఇకపోతే దాని తరువాత మెగాస్టార్ నటించబోయే 152వ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవల ఎంతో గ్రాండ్ గా జరిగాయి. 

కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఎంతో భారీగా నిర్మించనున్నాయి. ఇకపోతే ఈ సినిమా టైటిల్, సంగీత దర్శకుడు మరియు హీరోయిన్ విషయమై కొద్దిరోజులుగా పలు వార్తలు ప్రచారం అవుతుండడంతో, వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ ఈ సినిమాకు సంబందించిన అధికారిక వివరాలన్నీ కూడా రాబోయే దీపావళి నాడు వెల్లడి కానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం ఒక స్టార్ హీరోయిన్ ఎంపిక అయిందని, అలానే ఒక యువ సంగీత దర్శకుడిని కూడా ఎంపిక చేయడం జరిగిందని, ఇక టైటిల్ విషయమై కూడా టీమ్ ఆల్మోస్ట్ చాలావరకు ఒక నిర్ణయానికి వచ్చారని, 

అయితే ఈ పూర్తి వివరాలన్నీ కూడా దీపావళి పండుగ రోజున మీడియా ముఖంగా ప్రకటించడం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా విషయమై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకోవడంతో, దర్శకుడు కొరటాల శివ కూడా, ఈ సినిమాను ఫ్యాన్స్ కు నచ్చే విధంగా అన్ని రకాల కమర్షియల్ హంగులు కలిగి ఉండేలా దీనిని తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే, మెగా ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వచ్చినట్లే అని చెప్పాలి...!!


మరింత సమాచారం తెలుసుకోండి: