మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ హీరోలుగా టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. కొద్దిరోజుల క్రితం షూటింగ్ ప్రారంభించుకున్న ఈ సినిమా, మొదటి నుండి ఏవో కొన్ని సమస్యలతో షూటింగ్ ని మధ్యలో పోస్ట్ పోన్ చేసుకుంటూ మెల్లగా ముందుకు సాగుతోంది. ఇక ఇటీవల ఈ సినిమా నుండి ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా సెలెక్ట్ అయిన హాలీవుడ్ భామ ఎడ్గార్ జోన్స్ సడన్ గా తప్పుకోవడంతో ఈ సినిమాకు తొలి బ్రేకు పడింది. ఇక మధ్యలో కొద్దిరోజుల క్రితం, హీరోలైన ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కొద్దిపాటి గాయాల బారిన పడడంతో ఇంకొన్నాళ్ళు బ్రేక్ పడింది. 

ఇక ఆ తరువాత చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఆలియా భట్ కూడా అనారోగ్య సమస్యలతో షూటింగ్ కి హాజరు కాకపోవడంతో ఇంకొన్నాళ్లు వాయిదా పడిందని, ఇక ప్రస్తుతం లండన్ లో బాహుబలి స్పెషల్ స్క్రీనింగ్ ఉండడంతో మరికొద్దిరోజుల పాటు వాయిదా పడ్డట్లు చెప్తున్నారు. అయితే ఆ విధంగా ఇటువంటి అనుకోని అడ్డంకులు కనుక ఎదురు కాకపోతే ఆర్ఆర్ఆర్ మూవీ ఇప్పటీకే చాలావరకు షూటింగ్ ని జరుపుకుని ఉండేదని, ఇక ఈ పరిస్థితి చూస్తుంటే రాబోయే మరికొద్దిరోజుల వరకు తదుపరి షెడ్యూల్ కూడా జరిగేలా లేదని, కాబట్టి సినిమాకు భారీగా బ్రేకులు పడుతుండడంతో, సినిమా అసలు అనుకున్న సమయానికి విడుదల అవుతుందా అనే అనుమానాలు అనేకమంది ప్రేక్షకుల్లో తలెత్తుతున్నాయని అంటున్నారు. 

అయితే వీటిపై కొందరు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ, నిజానికి తమకు ఉన్న సమాచారం ప్రకారం, మధ్యలో ఆర్ఆర్ఆర్ సినిమాకు కొన్ని అనుకోని కారణాల వలన బ్రేకులు పడ్డ విషయం వాస్తవమేనని, అయితే దర్శకుడు రాజమౌళి సహా సినిమా యూనిట్ మొత్తం, ఎప్పటికపుడు సినిమా ప్రోగ్రెస్ పై ఎంతో శ్రద్దగా ఉన్నారని, కాబట్టి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు చాలావరకు ఉండవని, తప్పకుండా సినిమాను అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి రాజమౌళి టీమ్ ఈ విషయమై ఎంతవరకు మాట నిలబెట్టుకుంటుందో చూడాలి...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: