ఈమధ్య అమితాబ్ కు అనారోగ్య సమస్యలు ఏర్పడటంతో ప్రస్తుతం ఆయన ముంబాయ్ లోని ఒక ప్రముఖ హాస్పటల్ లో తన లివర్ సమస్యలకు వైద్యం చేయించుకుంటున్నాడు. దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళి తన ‘సైరా’ ను అనేకమంది రాజకీయ ప్రముఖులకు చూపించిన తరువాత చిరంజీవి ముంబాయ్ వెళ్ళి అమితాబ్ ను పరామర్శించి ఆ తరువాత హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది.

‘సైరా’ కలక్షన్స్ గురించి వివరాలు అడిగిన అమితాబ్ తన మాటల మధ్యలో ఈ మధ్య చిరంజీవి అమరావతి వెళ్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కలిసిన విషయాలకు సంబంధించిన వివరాలు అడుగుతూ అమితాబ్ చిరంజీవితో కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు టాక్. త్వరలో ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ గా చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమిస్తుంది అని వస్తున్న వార్తల పై అమితాబ్ చిరంజీవి అభిప్రాయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. 

ఈ మాటలు అమితాబ్ నోటి నుండి విన్న చిరంజీవి షాక్ అవ్వడమే కాకుండా ఇక తనకు రాజకీయాలు అన్నా పదవులు అన్నా పూర్తిగా మోజు తీరిపోయింది అని చెప్పినట్లు లీకులు వస్తున్నాయి. అంతేకాదు భవిష్యత్ లో తాను ఏ రాజకీయ పార్టీలోను చేరనని తన అవసరం పవన్ కు ఉంది అని భావిస్తే అన్నీ కుదిరితే పవన్ ‘జనసేన’ కోసం కేవలం ప్రచారం చేస్తాను కానీ తనకు ఏపదవుల పట్ల ఆ శక్తిలేదు అంటూ నవ్వుతు అమితాబ్ కు సమాధానం ఇచ్చినట్లు గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

అమితాబ్ గత కొన్ని సంవత్సరాలుగా గుజరాత్ ప్రభుత్వానికి టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ గా తన సేవలు అందిస్తున్నాడు. ఈ ఆసక్తితోనే చిరంజీవి ఆంధ్రప్రదేశ్ టూరిజమ్ బ్రాండ్ అంబాసిడర్ కాబోతున్నాడు అని వస్తున్న వార్తల పై క్లారిటీ అడిగి ఉంటాడు అని అనుకోవాలి. ఏమైనా రాజకీయాల వల్ల చిరంజీవికి వచ్చిన షాక్ ఇప్పట్లో మర్చిపోయే సూచనలు కనిపించడం లేదు..


మరింత సమాచారం తెలుసుకోండి: