ప్రస్థుతం లండన్ లో ఉన్న రాజమౌళి ఇంకా తన లండన్ ట్రిప్ నుండి తిరిగి రాకుండానే జక్కన్నకు ఊహించని మెసేజ్ అలియా భట్ నుండి అందినట్లు తెలుస్తోంది. చరణ్ ‘సైరా’ హడావిడి నుండి బయటకు రావడంతో దీపావళి తరువాత రామ్ చరణ్ అలియా భట్ లపై కొన్నికీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ ను ప్రారంభించాలని రాజమౌళి భావించినట్లు టాక్.

అయితే తాను ఆ షూటింగ్ కు అందుబాటులో ఉండలేనని అలియా భట్ ఇప్పటికే రాజమౌళికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. దీనికి కారణం ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్ శాలి వచ్చే నెల నుండి మొదలు పెట్టబోతున్న ‘గంగుభాయ్’ మూవీ షూటింగ్ అని అంటున్నారు. 

ఈ మూవీ కోసం కొన్ని బల్క్ డేట్స్ చాల ముందుగానే అలియా ఇచ్చేసినట్లు బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. వాస్తవానికి ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం అలియా భట్ కేటాయించిన డేట్స్ రకరకాల కారణాలతో వృథా అయిన పరిస్థితులలో తన డేట్స్ ను ప్రస్తుతం తాను నటిస్తున్న ‘సడక్ 2’ ‘బ్రహ్మాస్త్ర’ మూవీల కోసం ఉపయోగించి ఇప్పుడు నవంబర్ నుండి సంజయ్ లీలా భన్ శాలి ‘గంగుభాయ్’ కి ఇచ్చినట్లు తెలుస్తోంది.

దీనితో ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి చరణ్ అలియా భట్ లపై తీయవలసిన సన్నివేశాలు షూటింగ్ డిసెంబర్ కు వాయిదా పడినట్లు టాక్. ఇలా రకరకాల కారణాలతో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ వాయిదా పడుతున్న పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలు ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించి అనుకున్న సమయానికి విడుదల అవ్వకుండా అడ్డు పడుతున్నాయని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. అయితే ఈ మూవీ నిర్మాత దానయ్య మటుకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా ‘ఆర్ ఆర్ ఆర్’ ను వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయడం ఖాయం అంటూ మీడియాకు లీకులు ఇస్తున్నాడు..


మరింత సమాచారం తెలుసుకోండి: