తమిళ్ లో బిజీ ఆర్టిస్ట్ ఎవరు.. అని అడిగితే కోలీవుడ్ మొత్తం ముక్కకంఠంతో చెప్పే పేరు విజయ్ సేతుపతి. మాధవన్ తో కలిసి నటించిన విక్రమ్ వేధ చిత్రంతో టాప్ రేంజ్ కి వెళ్లిన సేతుపతి అక్కడ హీరో కాదు. కానీ హీరో వర్షిప్ అతని సొంతం. హీరో కాకుండానే అభిమాన సంఘాలున్న నటుడు. నటనలో సహజత్వం అతని సొంతం. ప్రస్తుతం లాభం అనే సినిమాలో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమా సందర్భంగా ఆయన తీసుకున్న నిర్ణయం ప్రశంసలు అందుకుంటోంది.

 


విజయ్ సేతుపతి నటిస్తున్న లాభం సినిమాలో రైతు సమస్యలపై పోరాడే ఓ సామాజిక కార్యకర్త పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఓ సెట్ ను నిర్మించాలని భావించింది. రెగ్యులర్ ఈ సెట్ ను ఏ స్టూడియోలోనో నిర్మిస్తారు. కానీ విజయ్.. ఈ సినిమాను రియల్ లొకేషన్లోనే నిర్మించాలని భావించి అందుకు ఓ గ్రామాన్ని ఎంచుకున్నారు. ఆ ఊళ్లో నిజమైన భవనాన్నే నిర్మించాలని నిర్మాతలకు సూచించాడట విజయ్. షూటింగ్ అయిపోయాక ఆ గ్రామంలోని రైతులకు ఉపయోగపడేలా ఆ భవనాన్ని రైతులకే ఇచ్చేయాలని నిర్ణయించుకున్నాడట ఈ రాజ్ పాండీ. ఇందుకు సంబంధించిన ఖర్చు మొత్తం తానే భరిస్తానని నిర్మాతతో చెప్పాడట విజయ్. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. విజయ్ నిర్ణయానికి అందరి నుంచీ ప్రశంసలు లభిస్తున్నాయట.

 


సినిమా వాళ్లలో హీరోలు అడపాదడపా ఆయా గ్రామాలను దత్తత తీసుకోవటమో, సాయం చేయటమో చూస్తూంటాం. కానీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్న విజయ్ కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం హర్షణీయమని అంటున్నారు. విజయ్ ఇటివల తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సైరాలో రాజ్ పాండీ అనే పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే.

 


మరింత సమాచారం తెలుసుకోండి: