‘మా’ సంస్థ విభేదాలతో నిట్టనిలువుగా రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఈ విషయాలకు సంబంధం లేని వాళ్ళకు కూడ మా సంస్థలో జరుగుతున్న పరిణామాలు హాట్ న్యూస్ గా మారాయి. దీనికితోడు మీడియా వర్గాలు ఈ వార్తలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతో ‘మా’ సంస్థ రాజకీయాలు సామన్యుడుకి కూడ తెలిసిపోయాయి.

నిన్న అత్యంత హాట్ వాతావరణంలో జరిగిన ‘మా’ సంస్థ సమావేశంలో అనేకమంది చాల ఆవేశంగా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. దీనికితోడు మా సంస్థ సమావేశంలో పరుచూరి గోపాలకృష్ణకు అవమానం జరిగింది అంటూ ఓపెన్ గా పృథ్వీ చేసిన కామెంట్స్ ‘మా’ సంస్థ పరపతిని మరింత దిగజార్చాయి. 

ఇలాంటి పరిస్థితులలో ఈసమావేశం ముగిసిన తరువాత జీవిత రాజశేఖర్ లు మాట్లాడుతూ మా సంస్థకు సంబంధించిన కొన్ని సున్నిత విషయాల పరిష్కారానికి ఇండస్ట్రీలోని పెద్దల సహకారం తీసుకుంటామని లీకులు ఇవ్వడంతో ఇప్పుడు ఈ పంచాయితీ చిరంజీవి కాంపౌండ్ కు చేరే ఆస్కారం ఉంది అని అంటున్నారు. చిరంజీవితో జీవితా రాజశేఖర్ లతో పాటు నరేశ్ తో కూడ సాన్నిహిత్యం ఉన్న నేపధ్యంలో ఈరగడకు చిరంజీవి తీర్పు ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. 

ఇది ఇలా ఉండగా ఈవివాదం పై కేవలం చిరంజీవికి పూర్తి పెద్దరికం ఇవ్వకుండా ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించిన సీనియర్ హీరో కృష్ణరాజును కూడ ఈవ్యవహారానికి సంబంధించి రాయబారాలు చేయమని ‘మా’ సంస్థలోని ఒక వర్గం కోరుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈవ్యవహారం మరింత ముదిరి పరువు పోకుండా చిరంజీవి కృష్ణంరాజులు తమ పెద్దరికంతో ఒక పరిష్కారం వెతికితే బాగుంటుందని ‘మా’ సంస్థ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరివాడుగా కొనసాగుతున్న చిరంజీవి ఈసున్నిత సమస్య పై దృష్టి పెట్టి ఈసమస్యను ఇరు వర్గాలకు న్యాయం జరిగేలా పరిష్కరించడం అంత సులువైన పనికాదు అన్నమాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: