ప్రధాని మోడీ గాంధీ మహాత్ముడి 150వ జయంతి సందర్భంగా ఇండియాలోని సినీ, టీవీ తారలను ఆహ్వానించి వారికి విందు ఇచ్చారు.  మహాత్ముడి గురించిన అనేక విషయాలను మోడీ వాళ్లతో పంచుకున్నారు.  వారి నుంచి కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నారు.  ఇక ప్రధాని మోడీతో బాలీవుడ్ తారలు సెల్ఫీలు దిగారు.  ఆ సెల్ఫీ ఫోటోలను తారలు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో సౌత్ ఇండస్ట్రీ భగ్గు మన్నది.  ముఖ్యంగా రామ్ చరణ్ సతీమణి ఈ విషయంలో తన ఆసనాహాన్ని వ్యక్తం చేసింది.  


సినీ తారలు, టివి తారలంటే కేవలం బాలీవుడ్, హిందీ తారలు మాత్రమే కాదని, సౌత్ తారలు ఉన్నారని, వారిని కూడా పట్టించుకోవాలని కోరుతూ నిన్నటి రోజున ట్వీట్ చేసింది.  ఇలా రామ్ చరణ్ సతీమణి పోస్ట్ చేసిన తరువాత.. దానిపై క్లారిటీ ఇచ్చింది పీఎంఓ.  సౌత్ నుంచి దిల్ రాజు, బాల సుబ్రహ్మణ్యం, రకుల్ ప్రీత్ సింగ్, సాలూరి వాసూరావు, ఈనాడు సంస్థల ఎండి కిరణ్, ఈటీవి సీఈవో బాపినీడు తదితరులు హాజరయ్యారు.  


అయితే, వీరు మోడీతో దిగిన ఫోటోలు బయటకు రాలేదు.  తాజాగా ఓ ఫోటో బయటకు వచ్చింది.  అందులో దిల్ రాజు, బాల సుబ్రహ్మణ్యం, సాలూరి వాసూరావు తదితరులు ఉన్న ఫోటో అది.  బాలీవడ్ హీరోయిన్ తీసిన ఫొటోలో వీరంతా ఉండటం విశేషం.  అంతేకాదు, బాహుబలి టీమ్ రాజమౌళి, ప్రభాస్,రానాలను కూడా ఆహ్వానించారట.  కానీ, వారు లండన్ వెళ్లడంతో ఈ సదస్సుకు హాజరుకాలేకపోయినట్టు తెలుస్తోంది.  


సౌత్ ను పట్టించుకోవడం లేదని సౌత్ వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మోడీ ఇలాంటి కార్యక్రమాన్ని సౌత్ లో కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది కదా.  సౌత్ నుంచి మెగాస్టార్, రజినీకాంత్, మోహన్ లాల్ వంటి ప్రముఖులు తప్పకుండా హాజరవుతారు.  మోడీ, బీజేపీలు దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టాలని చూస్తున్నారు.  ఇలాంటి కార్యక్రమాలు సౌత్ లో చేస్తేనే కదా అవకాశాలు వచ్చేది.  పోనీ మెగా కుటుంబం నుంచి ఒక్కరినైనా ఈ వేడుకకు ఆహ్వానించినా బాగుండేది.  అటు తమిళ ఇండస్ట్రీ నుంచి ఎవర్ని ఆహ్వానించారో.. ఎవరు వచ్చారో తెలియడం లేదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: