దాసరి నారాయణరావు బహుముఖ ప్రతిభావంతుడు, ఆయన దర్శకుడు, నటుడు, రచయిత, పాటల, మాటల రచయిత కూడా. ఇక దాసరి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, తెలుగు దినపత్రిక స్థాపకుడు. ఇలా ఎన్నో కోణాలు దాసరిలో ఉన్నాయి. దాసరి ని వర్సటైల్ ఆర్టిస్ట్ అని చెప్పాలి. ఆయనలా ఎవరైనా ఉంటారంటే అది అతిశయోక్తే. రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉంటే వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్న గొప్ప మనిషిగా దాసరిని చెబుతారు.


అంతే కాదు, దాసరి కార్మిక పక్షపాతి. ఆయన సినిమా రంగంలో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దానిని సాధించి అందరికీ న్యాయం చేసిన వారిగా పేరు తెచ్చుకున్నారు. అర్ధరాత్రి తలుపు తట్టినా సమస్యను తీర్చే గొప్ప గుణం దాసరిది. ఆయన 2017లో ఈ లోకాన్ని వీడిపోయారు. మరి దాసరి లాంటి వారు టాలీవుడ్ కి ఇపుడు ఉన్నారా అంటే సమాధానం చెప్పడం కష్టమే.అయితే చిరంజీవి మీద ఇపుడు ఆ భారం పడిందని అంటున్నారు. దాసరి తో పోలిస్తే చిరంజీవి మెత్తగా ఉంటారు. కఠినత్వం కొన్ని విషయాల్లో చూపించలేరు. పైగా అందరివాడుగా ఉండాలనుకుంటారు. ఇలాంటి గుణాల వల్ల దాసరి లాగా చిరు ఒక సమస్యకు తీర్పు చెప్పే విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి.


దాసరి తన పర చూడకుండా తప్పు ఎక్కడ జరిగినా వాయించేసేవారు. ఆయనంటే అందరికీ గౌరవం, భక్తి కూడా మెండు, ఇక చిరంజీవి విషయంలో కూడా అవే ఉన్నా కూడా ఆయన తనదైన తీర్పులతో వాటిని ఎంతవరకూ నిలుపుకోగలరని కూడా డౌట్లు ఉన్నాయి. ఏది ఏమైనా పెద్ద వారు గతించారు. ఇపుడున్న వారిలో చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఉన్నారు. ఆయన సమస్యలను పరిష్కరించాలి. టాలీవుడ్ పరువు పోకుండా కాపాడాలి. అవసరం అనిపిస్తే ఆయన  కఠినంగా ఉంటూ విశ్వరూపం కూడా చూపాలి. మరి మా లో నెలకొన్న విభేదాలకు చిరు మార్క్ తీర్పు చెప్పగలరా.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: