చిరంజీవి సినీ  లోని మొట్టమొదటి చారిత్రాత్మక చిత్రంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. దాదాపు రెండు వందల యాభై కోట్లకు పైగా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించారు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. కాగా ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. అయితే మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా టాలీవుడ్ లో  మంచి కలెక్షన్లు కూడా రాబట్టింది . అయితే ఈ సినిమాలో చిరంజీవి తన నట విశ్వరూపాన్ని చూపించి  ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ప్రశంసలు దక్కాయి. 



 ఈ నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమా ఏమిటి అనే దానిపై ప్రస్తుతం మెగా అభిమానులతో పాటు  సినీ ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు అందరి దృష్టి చిరంజీవి నెక్స్ట్ సినిమా ఏంటి నెక్స్ట్ సినిమా ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు అనే దానిపైనే ఉంది. ఇక మెగాస్టార్ తదుపరి చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. వచ్చే నెల ఈ సినిమా పట్టాలెక్కినుండగా దానికి సంబంధించిన సన్నాహాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా బాలీవుడ్ సంగీత దర్శకులు అజయ్-అతుల్  పైన ఆసక్తి కనబరుస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి. 



 మామూలుగా అయితే దర్శకుడు కొరటాల శివ సినిమా అంటే అందులో దేవి శ్రీ ప్రసాద్ సంగీతం తప్పకుండా ఉంటుంది. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ సినిమాకి కొత్తదనం ఆశిస్తున్నారట . అందుకే అజయ్ అతుల్ పేర్లను సూచిస్తున్నట్లు గా తెలుస్తోంది. అయితే ఈ విషయంలో చరణ్ కూడా ఆసక్తి కనబరచినట్లు సమాచారం. అయితే కొరటాల శివ కూడా అందుకు అంగీకరించి వాళ్లతో చర్చలు జరుపుతున్నారట. కాగా ఈ సినిమాకు నిర్మాతలుగా  రామ్ చరణ్ , నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా త్రిష పేరు పరిశీలిస్తున్నారట చిత్రబంధం.


మరింత సమాచారం తెలుసుకోండి: