సినిమా పెద్దది., చిన్నది., మన హీరోనా కాదా అన్న బేధ భావం లేకుండా సినిమా కథ బావుండి..,, జనాలను మెప్పించగలిగితే హిట్ పడటం ఖాయం.. అర్జున్ రెడ్డి వంటి మధ్య తరహా సినిమా ఇప్పుడు భారత్ అంతటా పేరు పొందింది అంటే దానికి కేవలం కధ కాంబినేషన్ కారణం.. బిచ్చగాడు, అర్జున్ రెడ్డి, ఇలాంటి ఎన్నో చిన్న సినిమాలు చాలా భారీ స్థాయిలో వసూళ్ళు సాధించి నెంబర్ వన్ గా నిలిచాయి అంటే దానికి కారణం చిన్న సినిమాలను ఆదరిస్తున్న ప్రేక్షకులే.. ఇప్పుడు ఇదే తరహాలో రాబోతున్న మరో సినిమా 'మళ్ళీ మళ్ళీ చూసా'.

 

అనురాగ్‌ కొణిదెన హీరోగా పరిచయం కాబోతున్న చిత్రం ‘మళ్ళీ మళ్ళీ చూశా’ సినిమాలో శ్వేత అవస్తి, కైరవి తక్కర్‌ హీరోయిన్స్‌గా నటించారు. హేమంత్‌ కార్తీక్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కె.కోటేశ్వరరావు నిర్మాతగా వ్యవహరించి ఈ సినిమాను గత శుక్రవారం విడుదల చేశారు. సక్సెస్‌ మీట్‌లో డైరెక్టర్ హేమంత్‌ కార్తీక్‌ మాట్లాడుతూ ‘‘చాలా సంవత్సరాలుగా తాను దర్శకత్వ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను అని., వయసు కాదు.. ప్రతిభే ముఖ్యం అని నమ్మిన కోటేశ్వరరావుగారు తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ తెలుపుకున్నారు.

 

 ‘‘చిన్న సినిమా, పెద్ద సినిమా అని కాకుండా మంచి సినిమాలను ఎప్పుడూ ప్రోత్సహించే మీడియా రంగంలో నేను ఉన్నందుకు గర్వంగా ఉంది’’ అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సతీష్‌ పాలకుర్తి పేర్కొన్నారు... ‘‘మాకు ఎంతో సహాయ సహకారాలు అందించిన మైత్రీ మూవీస్‌ రవిగారు, నిర్మాత అనిల్‌ సుంకరగార్లకు ధన్యవాదాలు’’ తెలుపుకున్నారు కొత్తగా పరిచయం కానున్న హీరో అనురాగ్‌ కొణిదెన. లిరిసిస్ట్‌ తిరుపతి జవాన్, హీరోయిన్‌ శ్వేతా అవస్తి కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ వారి పాత్రలకు., వారి ప్రాముఖ్యతకు., అవకాశం కలిపించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకున్నారు.. ఈ సినిమా హిట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: