‘మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)’లో ఎం జరిగినా అది న్యూస్ అవడం ఒక విశేషం. ఈ ఆదివారం మా లో జరిగిన సమావేశాల్లో కొన్ని చర్చనీయాంశంగా మారాయి. నటుడు వీకే నరేశ్‌ అధ్యక్షతన ఒక కొత్త కార్యవర్గం ఏర్పడిన సంగతి అందరికి తెలిసిన విషయమే. అయితే ఈ కొత్త కార్యవర్గం ఏర్పడి ఆరు నెలలు కూడా కాకముందే సభ్యుల మధ్య అంతరాలు పెరగడంతో ఇటీవల చాలా వివాదాలు తలెత్తుతున్నాయని కొందరి అభిప్రాయం. 

 

మా అసోసియేషన్లో అటు నరేశ్, ఇటు ‘మా’ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌ అంటూ రెండు వర్గాలు తయారయ్యాయని సమాచారం. ఆదివారం ‘మా’  సభ్యుల మీటింగ్‌ ఉందంటూ ‘మా’ జనరల్‌ సెక్రటరీ జీవిత, రాజశేఖర్‌లు ‘మా’ సభ్యులకు, ఈసీ మెంబర్లకు మెసేజ్‌లు పంపించడంతో చాలా వివాదాలు రాజుకున్నాయి. ఫిల్మ్‌చాంబర్‌లో ఆదివారం నిర్వహించిన ‘మా’ సమావేశంలో నరేశ్, రాజశేఖర్‌ల రెండు వర్గాల మధ్య మాటల యుద్ధాలు జరిగాయి. ప్రముఖ అధ్యక్షుడి స్థానంలో ఉన్న నరేశ్‌ ‘మా’ కి నిధుల సేకరణ మాటను గాలికి వదిలి, అసోసియేషన్ లో దాదాపు 5.5కోట్ల మూల ధనం నుంచి ఖర్చు చేస్తున్నారని మా లో సభ్యులు నిందించారు..

 

ఇరువర్గాల వారిని ‘మా’ ట్రెజరర్‌ పరుచూరి గోపాలకృష్ణ నచ్చచెప్పడానికి ఎంత ప్రయత్నించినా, అతని మాటను కనీసం లెక్క చేయకపోవడంతో సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. కానీ!! కోర్టు ఆర్డర్‌ ప్రకారం ఇది ‘మా’ జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదని కేవలం ఫ్రెండ్లీ మీటింగే అని, త్వరలో జనరల్‌ బాడీ మీటింగ్‌ ఉంటుందని జీవితా–రాజశేఖర్‌లు చెప్పారు. నటుడు, ‘మా’ ఈసీ మెంబర్‌ పృథ్వీ మాట్లాడుతూ– ‘‘మా’లో కొందరు ప్రెసిడెంట్‌ ఆఫ్‌ ఇండియాలా ఫీలవుతున్నారని..,, కృష్ణంరాజు, చిరంజీవి వంటి సినీ పెద్దలు జోక్యం చేసుకుంటేనే ‘మా’ సమస్యకి పరిష్కారం అవుతుందని మండిపడ్డారు. సమావేశం తర్వాత బయటికి వచ్చిన ‘మా’ సభ్యులు ఎవరికి తోచింది వారు మీడియా ముందు చెప్పడం ఒక వింతలా మారింది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: