రాజుగారి గ‌ది సీరిస్‌తో తెలుగులో ఓంకార్ ఓ ఆస‌క్తి క్రియేట్ చేశాడు ఈ సీరిస్‌లో భాగంగా వ‌చ్చిన తొలి సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆ వెంట‌నే నాగార్జు, స‌మంత‌, శీర‌త్‌క‌పూర్ లాంటి వాళ్ల‌ను పెట్టి రాజుగారి గ‌ది 2 సినిమా చేశాడు. ఆ సినిమా అంత‌గా ఆడ‌క‌పోయినా ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో ప్ర‌య‌త్నంలో రాజుగారి గ‌ది 3 సినిమా తెర‌కెక్కించాడు.


ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు - అవికర్ గోర్ నాయకా నాయికలుగా రాజుగారి గది 3 రూపొందింది. హారర్ కామెడీగా ఈ నెల 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి మూడు రోజుల్లో ఈ సినిమా 3.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఈ సినిమాకి అయిన బడ్జెట్ .. అమ్మకాలను బట్టి చూస్తే, లాభాల బాట పట్టడానికి మరికొన్ని రోజులు థియేటర్స్ లో నిలబడవలసి ఉంటుంది.


ఇక ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో రు.4 కోట్ల‌కు అమ్మారు. అంటే ఇప్ప‌టికే 70 శాతం రిక‌వ‌రీ చేసేసింది. ఈ వారంలో ఈ సినిమాకి పోటీగా నిలిచే తెలుగు సినిమాలు కూడా ఏమీ లేవు. తమిళ సినిమాలైన 'బిజిల్' .. 'ఖైదీ' సినిమాలు మాత్రం రంగంలోకి దిగులుతున్నాయి. విజయ్ హీరోగా రూపొందిన 'బిజిల్' పై .. కార్తీ హీరోగా చేసిన 'ఖైదీ'పై అందరిలోనూ ఆసక్తి వుంది.


ఇక ఈ నెల 25న ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ లోగా రాజుగారి గ‌ది 3 ఎంత వ‌ర‌కు షేర్ రాబ‌డుతుందో ?  చూడాలి. ఏదేమైనా రాజుగారి గ‌ది సీరిస్‌తో ఓంకార్ మరో విజ‌యం త‌న ఖాతాలో దాదాపు వేసుకున్న‌ట్టే. ఇక ఈ సీరిస్‌లో నాలుగో సినిమాను ఓంకార్ సీనియ‌ర్ హీరో వెంక‌టేష్‌తో తెర‌కెక్కించే అవ‌కాశాలు ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: