విక్టరీ వెంకటేష్, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా "వెంకీ మామ". రామానాయుడి గారి కలను నెరవేర్చడానికి మొదటిసారి రియల్ మామా అల్లుళ్ళు తెరమీద మామా అల్లుళ్లలాగా కనిపించనున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణని పూర్తి చేసుకుంది. మామ అల్లుడు నటిస్తున్న ఈ  మల్టీస్టారర్ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అక్కినేని దగ్గుబాటి ప్యాన్స్ మరియు తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


మొన్నటి వరకు దసరా కానుకగా విడుదల చేయాలని భావించిన చిత్ర బృందం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే దీపావళి కానుకగానైనా వస్తుందని భావించారు. కానీ "వెంకీ మామ" చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చిత్ర బృందం ప్రకటించింది. దసరాకి విడుదల చేయాలనుకున్న వారు సంక్రాంతి వరకు ఎందుకు పొడిగించారనే సందేహం ప్రతీ ఒక్కరిలో కలిగింది.


అయితే సంక్రాంతికి రిలీజ్ చేస్తే సేఫ్ జోన్ లో ఉంటుందని..అందుకే సంక్రాంతికి మార్చారనే ప్రచారం జరిగింది. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉందట. ఆ గ్రాఫిక్స్ వర్క్ పూర్తి అవడానికి చాలా పడుతుందట. గ్రాఫిక్స్ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేక సినిమా ఆలస్యం చేస్తున్నారట. నిర్మాతగా వ్యవహరిస్తున్న సురేష్ బాబు ఈ విషయమై చాలా పక్కాగా ఉన్నాడట.


ఆలస్యం అయినా ఫర్వాలేదు కానీ సినిమా ఔట్ ఫుట్ బాగా రావాలని అంటున్నాడట. ఈ చిత్రంలో హీరోయిన్లుగా పాయల్ రాజ్ పుత్, రాశీ ఖన్నా నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందో లేదో చూడాలి. ఇప్పటికే సంక్రాంతి పోటీలో రెండు పెద్ద చిత్రాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాలతో పోటీగా నిలుస్తుందా లేదా చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: