మిల్కీ బ్యూటీ తమన్నా ఓ పక్క హీరోయిన్ గా సత్తా చాటుతూనే మరోపక్క ఐటం సాంగ్స్ తో అదరగొడుతుంది. స్పెషల్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారుతుంది తమన్నా. లేటెస్ట్ గా సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాలో తమన్నా ఐటం సాంగ్ చేస్తుందని తెలుస్తుంది. అయితే సినిమాలో ఈ సాంగ్ గురించి స్పెషల్ గా చెప్పుకుంటున్నారు.   


ఇది మాములుగా వచ్చే సాంగ్ కాదట.. 1970 బ్యాక్ డ్రాప్ తో వస్తుందట. ఈ సాంగ్ కోసం ఓ సెపరేట్ సెట్ కూడా వేస్తున్నారని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ అంటే ఏంటో మరోసారి ఈ సాంగ్ తో తెలుస్తుందని.. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలిస్తుందని అంటున్నారు చిత్రయూనిట్. ఇప్పటికే సాంగ్ రికార్డింగ్ అవగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు ఊపు తెప్పించే సాంగ్ ఇదని అంటున్నారు.  


కొన్నాళ్లుగా దేవి శ్రీ ప్రసాద్ సినిమాలైతే చేస్తున్నాడు కాని తన మార్క్ మ్యూజిక్ ఇవ్వడంలో మాత్రం వెనుకపడ్డాడు. అయితే సరిలేరు నీకెవ్వరు విషయంలో మాత్రం అలా కాకుండా చాలా జాగ్రత్త వహిస్తున్నాడట. దేవి మ్యూజిక్ తమన్నా అందాలు ఈ సాంగ్ ను స్పెషల్ గా ఉంచేలా చేస్తాయట. ఇక ఈ సినిమాలో కొత్తగా మహేష్ క్రేజీ స్టెప్పులు ట్రై చేస్తున్నాడని టాక్.  


డ్యాన్స్ విషయంలో యాంటీ ఫ్యాన్స్ కు అవకాశం ఇచ్చే మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో కొత్తగా ప్రయత్నిస్తున్నాడని తెలుస్తుంది. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపుడి మహేష్ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: