గంగోత్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, ఆ తర్వాత వచ్చిన ఆర్య చిత్రంతో అందరి మతి పోగొట్టిన హీరో అల్లు అర్జున్. గంగోత్రీ సినిమాలో చూసిన వాళ్ళు చాలా రోజుల వరకు "ఆర్య" సినిమాలో చేసింది అతనేనా అని ఆశ్చర్యపోయారు. సినిమా సినిమాకీ అల్లు అర్జున్ మారిపోతుంటాడు. అందుకే ఆ పాత్రలన్నీ ఇప్పటికీ ఫ్రెష్ గా ఉంటాయి. సినిమాలోని గెటప్ చూసి అది ఏ సినిమానో ఇట్టే చెప్పేయచ్చు. అంత అంకితభావంతో పని చేస్తాడు కాబట్టే స్టైలిష్ స్టార్ అయ్యాడు.


బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో "అల వైకుంఠపురములో" అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ కోసం బన్నీ బాగా కష్టపడ్డాడట. నా పేరు సూర్య సినిమా కోసం బరువు పెరిగిన బన్నీ ఈ సినిమా కోసం చాలా బరువు తగ్గాడట. ఈ సినిమా కోసం బన్నీని బరువు తగ్గమని త్రివిక్రమ్  సూచించడంతో చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అయ్యి ఏకంగా నాలుగు నెలల్లోనే పద్నాలుగు కిలోలు తగ్గాడట.


అయితే బన్నీ ఈ బరువు తగ్గడానికి పెద్ద సాహసమే చేశాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. నాలుగు నెలలుగా ‘కీటోజెనిక్ డైట్’ తీసుకుని.. ఫిట్ నెస్ ట్రైనర్ సూచించిన జాగ్రత్తలు పాటించి పద్నాలుగు కిలోలు బరువు తగ్గాడు. నిజానికి నాలుగు నెలల్లో పద్నాలుగు కిలోలు తగ్గడం అంటే చిన్న విషయం కాదు. ఈ విధంగా దర్శకుడు త్రివిక్రమ్ కోరుకున్న రూపాన్ని తెచ్చుకోవడానికి అల్లు అర్జున్ చాలా కష్టపడ్డాడని తెలిసింది..


బన్నీ-త్రివిక్రమ్ మూవీ ‘అల వైకుంఠపురములో'  సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదలవుతోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఎమోషనల్ డ్రామాతోపాటు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సినిమా రూపొందుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: