టాలీవుడ్ సినిమా పరిశ్రమకు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన దేవదాసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ ఇలియానా. యంగ్ ఎనర్జిటిక్ రామ్ కు కూడా ఈ సినిమా డెబ్యూ మూవీ కావడం విశేషం. అయితే అప్పట్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు హీరోయిన్ గా నటించిన ఇలియానా తన అందం మరియు నటనతో బాగానే పేరు సంపాదించింది. ఇక ఆ తరువాత ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరిలో నటించిన ఇలియానా, ఆ సినిమా అతి పెద్ద చరిత్ర సృష్టించడంతో, 

ఒక్కసారిగా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తరువాత వరుసగా పలువురు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు, క్రేజ్ దక్కించుకున్న ఇలియానా, ఇటీవల కొన్నాళ్లుగా సినిమాలు చేయడం తగ్గించారు. తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన అనంతరం ఇటీవల అతడి నుండి విడిపోయిన ఈ భామ, మళ్ళి సినిమాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇక ఇటీవల 'ది లవ్ లాఫ్' లైవ్ షోలో తన వ్యక్తిగత జీవితం, అభిరుచులు గురించి ఇలియానా మాట్లాడుతూ, నాకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇష్టం లేదు, అలానే  హీరోయిన్ అవ్వాలనే కోరిక కూడా ఎప్పుడూ లేదని షాకింగ్ గా చెప్పింది. 

అయితే అనుకోకుండా నేను హీరోయిన్ ను అయ్యాను. నిజానికి సింగర్ కావాలనేది నా కోరిక అని ఇలియానా చెప్పుకొచ్చింది. ఇక తను సినీ కెరీర్ లో చాలా మందితో డేటింగ్ చేశానని, అయితే ఎవ్వరు తనకు పుష్పగుచ్చాలు ఇవ్వలేదని ఇలియానా సంచలన కామెంట్స్ చేసింది. అయితే తనకు గుర్తున్న వరకు తన తండ్రి నుంచి మాత్రమే పుష్ప గుచ్చాన్ని అందుకున్నానని పేర్కొంది. ఇక బాలీవుడ్ లో తనకు హీరోయిన్ నర్గీస్ ఫక్రీ, అర్షద్ వార్సీ, వరుణ్ ధావన్ అంటే ఇష్టమని కూడా ఇలియానా తెలిపింది. కాగా ఇలియానా చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: